హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దమ్మాయిగూడ బాలిక ఇందు మృతి కేసును ఛేదించిన పోలీసులు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడెం అంబేద్కర్ నగర్‌లో జరిగిన బాలిక ఇందు అనుమానాస్పద మృతి కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. టాయిలెట్ కోసం చెరువు వద్దకు వెళ్లిన చిన్నారి.. ప్రమాదవశాత్తు జారి చెరువులో పడిపోయినట్లు తేల్చారు. ఇందు మృతిపై అనుమానాలు లేవని పోస్టుమార్టం నివేదికలో వైద్యులు వెల్లడించినట్లు తెలిపారు. చెరువులో పడటంతోనే ఊపరితిత్తులోకి నీరు చేరినట్లు నీరు చేరినట్లు పోస్టుమార్టం నివేదికలో వైద్యులు పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు.

గాంధీ ఫోరెన్సిక్ టీం పోస్ట్ మార్టం నేవేదిక ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ మేరకు వివరాలు వెల్లడించారు. ఇందు అదృశ్యమైన మరుసటి రోజు నీటిలో పడినట్టు పోస్టుమార్టం నివేదిక ద్వారా నిర్ధారణ అయింది. అయితే ఈ ఘటనపై పోలీసులు, స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. అక్కడ గంజాయి బ్యాచ్ కదలికలు ఎక్కువగా ఉండటం, అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారడంతో పోలీసులు, స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటికే పలు గంజాయి బ్యాచ్‌లను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అంతేగాక, బాలిక తల్లిదండ్రుల మొబైల్ ఫోన్లను కూడా పోలీసులు పరిశీలించారు.

 Dammaiguda girl missing and death case mystery revealed

కాగా, డిసెంబర్ 15న పాఠశాలకు వెళ్లి అదృశ్యమైన ఇందు.. చెరువులో శవమై కనిపించడం కలకలం రేపింది. జవహర్ నగర్ పరిధి ఎన్టీఆర్ నగర్ కాలనీలో పాత సామాగ్రి సేకరిస్తూ ఉపాధి పొందే జీడల నరేష్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఈ ముగ్గురు చిన్నారులు దమ్మాయిగూడలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. గత గురువారం ఉదయం చిన్న కుమార్తె ఇందు(10), కుమారుడు(12)ని తీసుకుని తండ్రి నరేష్ తన బైక్‌పై పాఠశాలకు బయల్దేరాడు. పని ఉందంటూ పిల్లలిద్దరిని మధ్యలో దింపి నడిచి వెళ్లమని చెప్పాడు. దీంతో వారు నడుచుకుంటూ పాఠశాలకు చేరుకున్నారు.

కొద్దిసేపటి తర్వాత పుస్తకం మరిచిపోయానని తెచ్చుకుంటానని ఇందు ఒంటరిగా పాఠశాల నుంచి బయకు వెళ్లింది. హాజరు తీసుకుంటున్న టీచర్ విద్యార్థిని రాలేదని గుర్తించి వెంటనే కుటుంబసభ్యులకు సమాచాం ఇచ్చారు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గురువారం సాయంత్రం వరకూ ఎదురుచూసినా బాలిక ఆచూకీ తెలియరాలేదు.

పోలీసులు రాత్రి 7.30 గంటలకు డాగ్ స్క్వాడ్ తో గాలింపు చేపట్టగా.. దమ్మాయిగూడ చెరువు వద్దకు వెళ్లాయి. సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించగా.. బాలిక గురువారం ఉదయం 9.23 గంటల సమయంలో పాఠశాల సమీపం నుంచి ఒంటరిగా వెళ్తున్నట్లు ఉంది. మరిన్ని ఫుటేజీల్లో దమ్మాయిగూడ చెరువు మార్గంలో బాలిక పరుగెత్తుకుంటూ వెళ్తున్నట్లు గుర్తించారు. ఆ తర్వాత చెరువులో బాకలి మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు. గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించగా.. ఊపిరితిత్తుల్లో నీరు చేరడంతోనే బాలిక ఇందు మృతి చెందినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడించారు. ఈ క్రమంలో బాలిక ప్రమాదవశాత్తు చెరువులో పడటం వల్లే ప్రాణాలు కోల్పోయిందని తేల్చారు.

English summary
Dammaiguda girl missing and death case mystery revealed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X