ఓటుకు నోటు: ఆధిపత్య పోరేనన్న గుత్తా, సోమేశ్‌పై దానం ఫైర్
హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ టీఆర్ఎస్ పార్టీకి ఏజెంట్‌లా పనిచేస్తున్నారంటూ మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత దానం నాగేందర్ విమర్శించారు. గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు గురువారం గవర్నర్ నరసింహన్‌ను కలిశారు.
జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్‌పై ఫిర్యాదు చేశారు. గవర్నర్‌తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జీహెచ్‌ఎంసీ వార్డులను అసంబద్ధంగా విభజించారని అన్నారు. వార్డుల పునర్విభజన టీఆర్ఎస్ నేతలు చెబుతున్నట్టుగా కమిషనర్ చేస్తున్నారని ఆరోపించారు.
అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకోవాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. జీహెచ్ఎంసీ కమిషనర్ గా సోమేష్ కుమార్ ను తప్పించి, ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని దానం పేర్కొన్నారు.

ఓటుకు నోటు: ఆధిపత్య పోరేనన్న ఎంపీ గుత్తా
తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఓటుకు నోటు వ్యవహారం ఆధిపత్య పోరేనని నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులపై కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని అన్నారు.
వరి ధాన్యానికి రూ. 150 మద్దతు ధర ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం శాంతి భద్రతల విషయంలో విఫలమైతేనే గవర్నర్ నిర్ణయాలు తీసుకుంటారని చెప్పారు.
సుష్మా, బాబు వ్వవహారం అప్రజాస్వామకం: పొంగులేటి
కేంద్ర, రాష్ట్ర స్ధాయిలో జరుగుతున్న పరిణామాలు రాజ్యాంగాన్ని అపహాస్యాన్ని చేస్తున్నాయని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. కేంద్రంలో సుష్మా స్వరాజ్, రాష్ట్రంలో చంద్రబాబు వ్వవహారం అప్రజాస్వామకమని అన్నారు.
కేసీఆర్ ఓటుకు నోటు వ్యవహారంతో పాటు ప్రజాసమస్యల్ని కూడా పట్టించుకోవాలని సూచించారు. కేసీఆర్ రైతులను పట్టించుకోవడం లేదని, రైతులకు మద్దతు ధర ఇవ్వాలని పొంగులేటి డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications