దానం నాగేందర్ సీరియస్, కొత్త పంచాయితీ..!!
ఎమ్మెల్యే దానం నాగేందర్ అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు సరైన ప్రోటోకాల్ ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. ఖైరతాబాద్ డబుల్ బెడ్ రూంల లక్కీ డ్రాలో ప్రోటోకాల్ రగడ చోటు చేసుకుంది. ప్రోటోకాల్ ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన దానం నాగేందర్.. కార్యక్రమం మధ్యలోనే అలిగి వెళ్లిపోయారు.
ఎమ్మెల్యే దానం నాగేందర్ అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈరోజు(శనివారం) బంజారా హిల్స్ కొమరం భీమ్ ఆదివాసీ భవన్‌లో ఖైరతాబాద్ గృహలక్ష్మి లబ్ధిదారుల ఎంపిక కోసం లక్కీ డ్రా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ ఈ కార్యక్రమంలో పాల్గొని లక్కీ డ్రా ద్వారా లబ్ధిదాలను ఎంపిక చేయాల్సి ఉంది. అయితే ఎమ్మెల్యే రాకముందే అధికారులు లక్కీ డ్రాను ప్రారంభించారు. దీనిపై దానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను వచ్చే వరకు కార్యక్రమాన్ని ప్రారంభించకుండా వేచి ఉండాల్సిందని దానం నాగేందర్ అధికారులను ప్రశ్నించారు. ప్రజా ప్రతినిధికి ఇవ్వాల్సిన ప్రోటోకాల్‌ను అధికారులు పాటించలేదని మండిపడ్డారు. ఎమ్మెల్యే హాజరయ్యే కార్యక్రమంలో ఆయన కోసం వేచి చూడకుండా లక్కీ డ్రా ప్రారంభించడం ఏమిటని అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

అధికారుల పై ఆగ్రహం
ప్రోటోకాల్ ఉల్లంఘనపై సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని దానం నాగేందర్ హెచ్చరించినట్లు సమాచారం. అధికారుల వ్యవహారశైలిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఆయన.. కార్యక్రమం మధ్యలోనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇందిరమ్మ ఫ్లాట్ల లక్కీ డ్రా హైదరాబాద్ క్యూర్ పరిధిలో కొనసాగుతోంది. కోర్ అర్బన్ ప్రాంతంలోని తొలి విడతలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ ఇళ్ల కేటాయింపు ప్రక్రియ కొనసాగుతోంది. గృహలక్ష్మి పథకం ద్వారా అర్హులైన పేద కుటుంబాలకు ఇళ్లు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని దానం నాగేందర్ తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి అర్హుడైన పేదవారికి ఇల్లు అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications