ఆకుపచ్చ కల కోసం నిలువెత్తు వృక్షమైన సామాన్యుడు 'వనజీవి రామయ్య'..

Subscribe to Oneindia Telugu

ఆయనో ఆకుపచ్చ కల కంటున్నాడు. కనుపాపల నిండా ఆకు వర్ణాన్ని నింపుకుని.. పుడమి తల్లి గుండెల మీద హరిత స్వప్నం వర్దిల్లాలని కాంక్షిస్తున్నాడు. భూమికి పచ్చాని రంగేసినట్లు అన్న కలేకూరి పాట లాగా.. కనిపించిన ప్రతీ చోట ఆకుపచ్చ రంగు అద్దుతున్నాడు.

ఆ నిర్విరామ హరిత స్వాప్నికుడు దరిపెల్లి రామయ్య. కానీ వనజీవి రామయ్య అంటేనే ఆయన ఎక్కువమందికి ఎరుకలోకి వస్తారు. ఏ స్వార్థమూ లేని ఆశయం ఆయనది.. బావి తరాల కోసం ఆయన నాటుతున్న హరిత కల.. అందమైన భవిష్యత్తును వాగ్దానం చేస్తోంది.

నీడలా పరుచుకుపోతున్నాడు:

నీడలా పరుచుకుపోతున్నాడు:

ఖమ్మం జిల్లా రెడ్డిపల్లి గ్రామానికి చెందిన వనజీవి రామయ్య వృక్షోరక్షతి.. రక్షితః అన్న సిద్దాంతాన్ని బలంగా విశ్వసిస్తారు. కాబట్టే మెడలో సైతం ఆ బోర్డు వేసుకుని మరీ తాను నమ్మిన సిద్దాంతాన్ని 10మందికి తెలిసేలా ప్రచారం చేస్తుంటారు.

వనజీవి రామయ్య అంటే నిజంగా ఓ నిలువెత్తు వృక్షం.. భవిష్యత్తు తరాలకు నీడనివ్వానికి ఈ నేల మీద ఆకుపచ్చగా పరుచుకుపోతున్నారు. ఖాళీ ప్రదేశం కనిపిస్తే చాలు.. తన వద్ద ఉన్న విత్తనాలు తీసుకెళ్లి అక్కడ చల్లేస్తుంటారు. సామాన్యులకు పెద్దగా తెలియని అడవి జాతి వృక్షాల విత్తనాలు సైతం ఆయన వద్ద బస్తాల కొద్ది నిల్వ ఉంటాయి.

మొక్క నాటనిదే మనసున పట్టదు:

మొక్క నాటనిదే మనసున పట్టదు:

రోడ్ల పక్కన, చెరువు కట్టల మీద.. ఇలా ఎక్కడైనా సరే, కాస్త ఖాళీ స్థలం కనిపించిందంటే.. ఒక మొక్క నాటనిదే ఆయనకు మనసున పట్టదు. అలా ఆయన నాటిన ఎన్నో మొక్కలు.. వటవృక్షాలుగా మారి ఎంతోమందికి నీడనిస్తున్నాయి.

పాత రేకులు, చిన్న చిన్న అట్టపెట్టెలను కూడా రామయ్య వదలరు. వాటిపై 'వృక్షోరక్షతి.. రక్షితః' అన్న సిద్దాంతాన్ని రాసి జనంలో తీసుకెళ్తుంటారు. సినిమా పాటల్ని, విప్లవ గీతాల్ని సైతం పేరడీలుగా మలచి చెట్ల పెంపకానికి సంబంధించిన ప్రాధాన్యతను వివరిస్తారు.

ఇదీ ఆయన నిబద్దత:

ఇదీ ఆయన నిబద్దత:

వృక్షోరక్షతి.. రక్షితః అన్న సిద్దాంతానికి ఆయన ఎంత నిబద్దుడు అంటే.. ఆఖరికి తన మనుమరాళ్లకు కూడా చందనపుష్ప, హరితలావణ్య, కబంధపుష్ప అని మొక్కల పేర్లు పెట్టుకున్నాడు. వయసు పైబడుతున్నా.. విశ్రాంతి తీసుకోవాలన్న ఆలోచన కూడా ఆయనకు రాదు. మొక్కలు.. వాటి సంరక్షణ.. ఇదే అనునిత్యం ఆయన ఆలోచన. అలా దాదాపు కోటికి పైగా మొక్కలను నాటి దేశానికే ఆదర్శంగా నిలిచిన వ్యక్తి ఆయన.

నిండు హృదయంతో సలాం:

నిండు హృదయంతో సలాం:

నేపథ్యం కూడా అంత గొప్పదేమి కాదు.. ఉన్నత వర్గానికి చెందినవాడు అసలే కాదు. ఉన్నదాంట్లో ఎక్కువ మొత్తాన్ని మొక్కల పెంపకానికే వెచ్చిస్తాడు. కుటుంబ సభ్యులు సైతం ఆయనకు ఏనాడు అడ్డు చెప్పలేదు. అలా నిర్విరామంగా సాగుతూ వచ్చిన ఆ ప్రయాణాన్ని 'పద్మశ్రీ' కూడా పలకరించింది. కేంద్రం ఆయన కృషిని గుర్తించి పద్మశ్రీ అవార్డు ప్రకటించింది.

ఇటీవల ఆయన గుండెపోటుకు గురవడం చాలామందిని కలవరపెట్టింది. ఆయన వైద్య ఖర్చులను కూడా ప్రభుత్వమే భరించాలని నిర్ణయించింది. ఇప్పుడిప్పుడే తిరిగి కోలుకుంటున్న రామయ్య.. పూర్తి ఆరోగ్యంతో మళ్లీ హరితబాట పట్టాలని కోరుకుందాం. చెట్టు లాంటి ఆ మనిషికి నిండు హృదయంతో ఒక సలాం చెబుదాం..

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
When whole world is looking for an alternate of deforestation this man is running a crusade at the same front alone. Daripalli Ramaiah, 68, of Khammam District in Telangana has been planted thousands of trees in last five decades. He started plantation as a passion at age of 18 but when it has become a mission he is unable to recall.
Please Wait while comments are loading...