Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఖమ్మంతో దాసరికి విడదీయరాని సంబంధం

దర్శకరత్న దాసరినారాయణరావుకు ఖమ్మం జిల్లాతో విడదీయరాని సంబంధం ఉంది. ఖమ్మం జిల్లాకు ఆయన అల్లుడు కావడంతో ఆయన తరచూ ఈ జిల్లాలో పర్యటించేవాడని ఆయన కుటుంబసభ్యులు, బంధువులు చెబుతుంటారు.

ఖమ్మం: దర్శకరత్న దాసరినారాయణరావుకు ఖమ్మం జిల్లాతో విడదీయరాని సంబంధం ఉంది. ఖమ్మం జిల్లాకు ఆయన అల్లుడు కావడంతో ఆయన తరచూ ఈ జిల్లాలో పర్యటించేవాడని ఆయన కుటుంబసభ్యులు, బంధువులు చెబుతుంటారు.

తెలుగు సినీ పరిశ్రమలో ఎందరితోనో గురువుగారు అని పిలిపించుకొన్న దాసరినారాయణరావు మృతితో ఖమ్మం జిల్లాలో విషాదఛాయాలు అలుముకొన్నాయి.

Dasari Narayana Rao close relationship with Khammam district

నాటకాలు వేసే సమయంలో ఆయన హైద్రాబాద్ కు తరచూవెళ్ళేవాడు.1960 దశకంలో నాటకాలు వేసేవాడు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నుండి నాటకాలు వేసేందుకు ఆయన ప్రయాణం చేసేవాడు.

పాలకొల్లు నుండి హైద్రాబాద్ కు వెళ్ళేటప్పుడు మార్గమధ్యలోని సత్తుపల్లిలో ఆగేవారు. అప్పటి నుండి దశాబ్దాలుగా ఆయన సత్తుపల్లికి రాకపోకలు సాగించేవారు. దాసరి పద్మ కుటుంబం సత్తుపల్లిలో ఉండేది.

అయితే చింతలపాటి వెంకటేశ్వర్ రావు కటుంబానికి దాసరికి సోదర సంబంధం ఉండేది. 2011 అక్టోబర్ 28న, దాసరి పద్మ మృతిచెందారు. ఆమె దశదినకర్మ అనంతరం సంప్రదాయం ప్రకారంగా నిద్రచేసేందుకుగాను సత్తుపల్లికి వచ్చారు.

దాసరి మరణవార్త తెలియగానే సత్తుపల్లికి చెందిన ఆయన ఆత్మీయుడు చింతలపాటి వెంకటేశ్వర్ రావు ఆయన కుమారుడు చింతలపాటి సత్యనారాయణ హుటాహుటిన హైద్రాబాద్ కు బయలుదేరి వెళ్ళారు. ఆయన మరణవార్త తెలుసుకొని కన్నీటి పర్యంతమయ్యారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+