సంకీర్త్ కుటుంబానికి దత్తాత్రేయ పరామర్శ : మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు చర్యలు (ఫోటోలు)

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్ : అమెరికాలో రూమ్ మేట్ అయిన తన స్నేహితుడి చేతిలో హత్యకు గురైన హైదరాబాద్ వాసి సంకీర్త్ కుటుంబ సభ్యులను కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ పరామర్శించారు. అంతకుముందు బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి కూడా సంకీర్త్ కుటుంబ సభ్యులను కలవగా.. మృతదేహాన్ని ఇండియా తీసుకొచ్చేందుకు కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ తో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు.

కాగా, మృతుడు గుండం సంకీర్త్ తండ్రి గుండం విజయ్ కుమార్ ను సుల్తాన్ బజార్ లోని వారి స్వగృహంలో పరామర్శించారు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ. సంకీర్త్ కుటుంబానికి ఆయన తన సానుభూతిని ప్రకటించారు.

ఈ సందర్బంగా కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఆయన.. సంకీర్త్ మృతదేహాన్ని ఇండియా తీసుకొచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. సంకీర్త్ హత్య తనను కలచివేసిందని నిందితులకు కఠిన శిక్ష పడాలన్నాతెలిపారు. సంకీర్త్ హత్య తనను కలచివేసిందని నిందితులకు కఠిన శిక్ష పడాలన్నారు దత్తాత్రేయ.

సంకీర్త్ హత్య

సంకీర్త్ హత్య

సంకీర్త్ హత్యకు సంబంధించి ఇప్పటికీ పూర్తి వివరాలేవి తెలియరాలేదు. రూమ్ మేట్ అయిన సందీప్ గౌడ్ హత్య చేశాడని తెలుస్తున్నా.. ఇద్దరి మధ్య ఘర్షణకు దారితీసిన విషయమేంటనేది ఇంకా తేలలేదు.

కేంద్రమంత్రి దత్తాత్రేయ

కేంద్రమంత్రి దత్తాత్రేయ

సంకీర్త్ కుటుంబ సభ్యుల పరామర్శించిన కేంద్రమంత్రి దత్తాత్రేయ.. సంకీర్త్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

విజయ్ కుమార్

విజయ్ కుమార్

సంకీర్త్ తండ్రి గుండం విజయ్ కుమార్ తో ఘటన గురించి మాట్లాడుతున్న కేంద్రమంత్రి దత్తాత్రేయ. విషయాన్ని కేంద్రం ద్రుష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

సంకీర్త్ హత్య

సంకీర్త్ హత్య

సంకీర్త్ హత్య తనను కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేసిన దత్తాత్రేయ.. నిందితులకు కఠిన శిక్ష పడాలన్నారు.

సందీప్

సందీప్

ఇదిలా ఉంటే, సందీప్ తో పాటు మరో రూమ్ మేట్ ప్రణీత్ కూడా సంకీర్త్ తో పాటే ఒకే గదిలో ఉంటున్నా.. హత్య సమయంలో తాను నిద్రలో ఉన్నానని చెబుతున్నాడు ప్రణీత్.

సందీప్

సందీప్

సంకీర్త్ ను హత్య చేసిన సందీప్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. ఇతడి నుంచి నిజాలు రాబట్టే ప్రయత్నం జరుగుతోంది. కాగా, సంకీర్త్ మృతదేహాన్ని ఇండియా తీసుకొచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు దత్తాత్రేయ.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Union Labour Minister Bandaru Dattatreya on Thursday visited the residence of a 24-year-old software engineer here, who was allegedly stabbed to death by his roommate in the US.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి