Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పక్కింటి కుర్రాడితో అలా.. మద్యం తాగి.. కన్నతల్లి హత్య కేసులో మరెన్నో ట్విస్టులు..!

హైదరాబాద్‌ : కన్నతల్లిని కర్కశంగా హతమార్చింది కసాయి కూతురు. దారి తప్పుతున్నావని మందలించినందుకు తల్లినే కడతేర్చింది. ఒకరితో ప్రేమాయణం సాగించి పెళ్లి వరకు వచ్చిన కూతురి కథ సాఫీగా సాగితే ఆ కుటుంబంలో ఇంతటి విషాదం ఉండేది కాదు. కానీ, పక్కింటి కుర్రాడితో సన్నిహితంగా ఉంటూ హద్దులు దాటిన కూతురును మందలించడమే ఆ తల్లి తప్పైంది. అలా చేస్తే కుటుంబం పరువు పోతుందని మంచి మాటలు చెప్పిన తల్లిని సొంత కూతురు కిరాతకంగా చంపేసిన ఘటనలో రోజుకో ట్విస్ట్ బయటపడుతోంది.

సొంత కూతురే తల్లిని పొట్టన పెట్టుకుని..!

సొంత కూతురే తల్లిని పొట్టన పెట్టుకుని..!

హైదరాబాద్ శివారు హయత్‌నగర్‌లో ఈ నెల 19వ తేదీన జరిగిన మహిళ హత్యోదంతం కలకలం రేపింది. సొంత కూతురే తల్లిని చంపిన ఈ ఘటనలో పోలీసులే విస్తుపోవాల్సిన పరిస్థితి. అయితే తల్లిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన కేసులో రోజుకో ట్విస్ట్ బయట పడుతోంది. పోలీసుల దర్యాప్తులో కూతురు నేరం అంగీకరించడంతో ఆమెతో పాటు సహకరించిన రెండో ప్రియుడిని కూడా కటాకటాల్లోకి నెట్టారు. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తుండటంతో మరిన్ని సంచలన నిజాలు బయటకొస్తున్నాయి.

19 ఏళ్లకే ఇంత ముదురా?

19 ఏళ్లకే ఇంత ముదురా?

ఈ నెల 19వ తేదీన హయత్‌నగర్‌లో 40 సంవత్సరాల రజిత అనే మహిళ హత్యకు గురి కావడం అలజడి రేపింది. అయితే ఈ కేసులో 19 సంవత్సరాల కూతురు కీర్తి నిందితురాలిగా తేలింది. రెండో ప్రియుడు శశి కుమార్‌తో కలిసి తల్లిని హత్య చేసినట్లు ఆమె అంగీకరించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో మరిన్ని నిజాలు రాబట్టే క్రమంలో రోజుకో ట్విస్ట్ బయట పడుతోంది.

ఈ నెల 19వ తేదీన తల్లి రజిత కూరగాయలు తేవడానికి బయటకు వెళ్లడంతో సందు చూసి పక్కింటి కుర్రాడైన శశి కుమార్ వాళ్లింట్లోకి దూరాడు. అప్పటికే కీర్తితో సన్నిహితంగా మెలగడంతో హద్దులు దాటి ప్రవర్తించారు. అదే సమయానికి బయటి నుంచి వచ్చిన రజిత ఆ సన్నివేశం చూసి ఇద్దరిని మందలించింది. దాంతో ఆమెపై కోపం పెంచుకున్న శశి కుమార్ అడ్డు తొలగించుకోవడానికి ప్లాన్ వేశాడు. అది కాస్తా కీర్తితో అమలు చేయించాడు.

ఒకే ఒక్క కూతురని గారాబంగా పెంచితే..!

ఒకే ఒక్క కూతురని గారాబంగా పెంచితే..!

యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం నిర్నాముల గ్రామానికి చెందిన పల్లెర్ల శ్రీనివాస్ రెడ్డి లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆ క్రమంలో పదేళ్ల కిందట భార్య రజిత, కూతురు కీర్తితో కలిసి ఉపాధి నిమిత్తం హైదరాబాద్ చేరుకున్నాడు. తుర్కయాంజిల్ మున్సిపాలిటీ పరిధిలోని మునగనూర్‌లో అద్దె ఇల్లు తీసుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత అక్కడి సమీపంలోని ద్వారకా సాయి నగర్ కాలనీలో సొంతిల్లు కట్టుకున్నాడు.

ఒకే ఒక్క కూతురు కావడంతో కీర్తిని కాస్తా గారాబంగా పెంచారు. ప్రస్తుతం ఆమె దిల్‌సుఖ్ నగర్‌లోని ఓ డిగ్రీ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతోంది. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇటీవల కీర్తి ప్రవర్తనలో మార్పు వచ్చింది. కొద్ది నెలల కిందట పక్క కాలనీకి చెందిన కృష్ణారెడ్డి కుమారుడు బాల్‌రెడ్డితో ప్రేమలో పడింది. అది కాస్తా రెండు కుటుంబాల పెద్దలకు తెలియడంతో వారికి పెళ్లి చేయాలని నిర్ణయించారు.

ఒకరితో ప్రేమ, పక్కింటి కుర్రాడితో హద్దులు దాటి..!

ఒకరితో ప్రేమ, పక్కింటి కుర్రాడితో హద్దులు దాటి..!

కీర్తి ప్రేమను తల్లిదండ్రులు అంగీకరించారు. పెళ్లికి కూడా ఒప్పుకున్నారు. అయితే ఇటీవల ఇంటి పక్కన ఉండే శశి కుమార్ అనే మరో యువకుడితో సన్నిహితంగా ఉంటోంది. విషయం తెలిసిన తల్లి కూతురును మందలించింది. బాల్‌రెడ్డితో వివాహం కుదిరాక ఇప్పుడు ఆ యువకుడితో తిరగడమేంటని నిలదీసింది. అంతేకాదు ఆ ఇద్దరు యువకులతో కీర్తి హద్దులు దాటిందనే విషయం కూడా తల్లికి తెలిసింది. దాంతో పలుమార్లు సీరియస్‌గా మందలించింది.

ఎదిగిన ఆడపిల్ల ఇలా చేయకూడదని.. పద్దతిగా ఉండాలని చెబుతూనే ప్రవర్తన మార్చుకోవాలంటూ సూచించింది. అయితే తల్లి తన మంచి కోరుతుందని భావించని కీర్తి మరోలా అర్థం చేసుకుంది. తనకు తల్లి అడ్డంకిగా మారిందని భావించి ఇంటి పక్కన ఉండే రెండో ప్రియుడు శశి కుమార్‌తో కలిసి హత్య చేయడానికి సిద్ధమైంది. ఆ క్రమంలో ఈ నెల 19వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో రజితను వారిద్దరూ కలిసి హతమార్చారు.

రోజుకో ట్విస్ట్.. ఇంకెన్నీ నిజాలు బయటపడతాయో..!

రోజుకో ట్విస్ట్.. ఇంకెన్నీ నిజాలు బయటపడతాయో..!

పోలీసులు సీరియస్‌గా ద‌ృష్టి సారించడంతో ఈ కేసులో మరిన్ని నిజాలు బయటపడుతున్నాయి. ఆ రోజు కీర్తి తల్లి తమను అలా చూడటంతో ఎప్పటికైనా ప్రమాదమని గ్రహించి ఆమెను చంపడానికి డిసైడయ్యాడు. అదే విషయం కీర్తికి చెప్పాడు. ఇద్దరం హ్యాపీగా ఉండాలంటే ఆమెను చంపాల్సిందే అని నూరిపోశాడు. ఆ క్రమంలో బయటకు వెళ్లిన శశి కుమార్ బీరు బాటిల్స్ తీసుకుని వచ్చాడు. ఆ సమయంలో కీర్తి తల్లి రజిత లోపలి గదిలో ఉంది. అదే అదనుగా వాళ్లింటి ఆవరణలోనే కీర్తికి బీరు తాగించాడు. తల్లిని ఎలా హత్య చేయాలనే దానిపై పలు అంశాలు క్లియర్‌గా చెప్పాడు. అనంతరం ఇద్దరూ కలిసి ఇంటి లోపలికి వెళ్లి ఆమెను కిరాతకంగా హత్య చేశారు.

మద్యం తాగించి హత్య చేసేలా ప్రేరేపించి..!

మద్యం తాగించి హత్య చేసేలా ప్రేరేపించి..!

కీర్తి, శశి కుమార్ ఇద్దరూ ఇంటి లోపలికి వెళ్లాక అతడు గడియ పెట్టాడు. అనంతరం తల్లి ఉన్న గదిలోకి వెళ్లిన కీర్తి ఆమె గట్టిగా అరవకుండా ముఖంపై దిండుతో నొక్కి పట్టుకుంది. అనంతరం శశి కుమార్ ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. ఆమెను చంపేశాక, ఇద్దరూ కలిసి అదే ఇంటిలో ఉన్నారు. మృతదేహం అక్కడే ఉన్నా.. ఎలాంటి భయం లేకుండా మూడు రోజుల పాటు సరాదాగా గడిపారు. చివరకు దుర్వాసన రావడంతో కీర్తి ప్లాన్ ప్రకారం.. ఆ డెడ్‌బాడీని వారి స్వంత గ్రామమైన రామన్న పేట మండల శివారులో పడేసి ఏమీ తెలియనట్లుగా హైదరాబాద్ చేరుకున్నారు. కీర్తి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు తీగ లాగడంతో డొంక కదిలింది. అయితే ఈ కేసులో ఇంకా ఎవరిదైనా ప్రమేయం ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు ముమ్మరం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+