శిరీష-రాజీవ్‌లు మద్యం తాగారు, సిసిటీవీలు ఉన్నాయి కానీ..: డిసిపి
బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో పోలీసులు సీన్‌ను రీ-కన్‌స్ట్రక్షన్ చేయలేదన్న విమర్శలపై డిసిపి వెంకటేశ్వర రావు బుధవారం స్పందించారు. ఆరోపణలను ఆయన కొట్టి పారేశారు.
హైదరాబాద్: బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో పోలీసులు సీన్‌ను రీ-కన్‌స్ట్రక్షన్ చేయలేదన్న విమర్శలపై డిసిపి వెంకటేశ్వర రావు బుధవారం స్పందించారు. ఆరోపణలను ఆయన కొట్టి పారేశారు. నిందితులు రాజీవ్, శ్రవణ్‌లను కుకునూరుపల్లికి తీసుకెళ్లామన్నారు.
నిందితులతో కలిసి సీన్‌ను రీ కన్‌స్ట్రక్షన్ చేశామని తెలిపారు. కుకునూరుపల్లి వెళ్లిన, వచ్చిన రూట్‌ను నిందితులతో కలిసి అనలైజ్ చేసామని తెలిపారు. కుకునూరుపల్లి వెళ్లడానికి ముందు కప్పా కాఫీ షాపులో వారు భేటీ అయ్యారని చెప్పారు.

అక్కడి నుంచి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వచ్చి ఎస్సైతో 5 నిమిషాలు మాట్లాడారని తెలిపారు. అనంతరం బంజారాహిల్స్‌లో మద్యం తాగి, రాయదుర్గంలో ఫుడ్ తీసుకున్నారన్నారు. రాయదుర్గం నుంచి ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా కుకునూరుపల్లి వెళ్లారన్నారు.
అక్కడి నుంచి అర్ధరాత్రి సమయంలో శామీర్ పేట, అల్వాల్ మీదుగా షేక్ పేట చేరుకున్నారని చెప్పారు. ఎస్సై ఆత్మహత్య చేసుకున్న క్వార్టర్స్‌కు తాము వెళ్లలేదని, ఆ అవసరం కూడా లేదని డిసిపి చెప్పారు. బయటి నుంచి మొత్తం చూసి వచ్చామన్నారు.
అక్కడి క్వార్టర్ మొత్తం పోలీసుల కస్టడీలో ఉందని తెలిపారు. కేసులో పూర్తి ఆధారాలను సేకరించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. శిరీష ఆత్మహత్య చేసుకున్న గదిలో సిసి కెమెరాలు ఉన్నాయని తెలిపారు. కానీ కనెక్టివిటీ లేక ఎక్కడా రికార్డు కాలేదన్నారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications