బల్దియా ప్రతిష్ట దెబ్బతీసే యత్నం .. దీపక్ రెడ్డి ఆరోపణలను తిప్పికొట్టిన దానకిశోర్

హైదరాబాద్ : నగరశివారు ఆసిఫ్ నగర్ మండలం గుడిమల్కాపూర్ భూములతో తనకుగానీ, బల్దియాకు ఎలాంటి సంబంధం లేదని కమిషనర్ దానకిశోర్ స్పష్టంచేశారు. సర్వే నెంబర్ 294 భూములకు, తనకు ఎటువంటి సంబంధం లేదని, ఎవరితో భాగస్వామ్యం కూడా లేదని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ, తన ప్రతిష్ట దెబ్బతీసేందుకు ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ఆరోపణలు చేశారని మండిపడ్డారు. ఆ భూములు తనకు చెందినవని ఇటీవల హైకోర్టులో దీపక్ రెడ్డి పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.

deepak reddy aligations are fake .. says ghmc commissioner dana kishore

ఇదీ విషయం ..
గుడిమల్కాపూర్ లో సర్వే నెంబర్ 294 భూములు జీహెచ్ ఎంసీ కమిషనర్ దానకిశోర్ కు చెందినవని ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో దీపక్ ఆరోపణలపై ఆదివారం కమిషనర్ దానకిశోర్ స్పందించారు. తన, బల్దియా ప్రతిష్ట దెబ్బతీసేందుకు దీపక్ కోర్టులో కేసు వేశారని పేర్కొన్నారు. గుడిమల్కాపూర్ సర్వే నంబర్ 294కు సంబంధించిన భూములపై యాజమాన్య హక్కును తెలియజేసే ఏ విధమైన డాక్యుమెంట్లు, పత్రాలు జీహెచ్ఎంసీకి దీపక్ రెడ్డి సమర్పించలేదని స్పష్టంచేశారు.

deepak reddy aligations are fake .. says ghmc commissioner dana kishore

పరువునష్టం దావా వేస్తా..

ఈ భూముల వ్యవహారంపై తనపై ఆరోపణలు చేసిన దీపక్ రెడ్డి పరువు నష్టం దావా వేస్తానని తెలిపారు దానకిశోర్. నిరాధారంగా తనను దీపక్ రెడ్డి నిందించి .. కోర్టులో కేసు వేశారని ఆరోపించారు. దీనిపై తాను కూడా న్యాయస్థానంలో దావా వేస్తానని స్పష్టంచేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+