సచివాలయానికి ఏమైంది - నివేదికలో విస్తుపోయే అంశాలు..!!

తెలంగాణ సచివాలయానికి ఏమైంది. భారీ ఖర్చుతో నిర్మించిన సచివాలయ భవనం లో వెలుగు లోకి వస్తున్న లోపాలు ఆందోళనకు కారణమవుతున్నాయి. ఇటీవలే సచివాలయం రెయిలింగ్ పెచ్చు లు ఊడిపడటం పైన విచారణ కొనసాగుతోంది. నూతన భవనంలో చాలా చోట్ల పగుళ్లు వచ్చినట్లు గుర్తించారు. డిజైన్‌ కోసం నిర్మించిన పిల్లర్లకు అమర్చిన ఫ్రేమ్‌లతోపాటు కొన్ని గోడల్లోనూ ఈ పగుళ్లు..నిర్మాణంలో లోపాలపైన ప్రభుత్వానికి నివేదిక అందింది.

సచివాలయంలో పగుళ్లు
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2019లో నూతన సచివాలయం కోసం శంకుస్థాపన చేసారు. 2023 ఏప్రిల్‌ 30న భవనాన్ని ప్రారంభించారు. రూ 1500 కోట్ల ఖర్చుతో ఈ నిర్మాణం పూర్తి చేసారు. రెండేళ్లకే సచివాలయంలో నిర్మాణ లోపాలు బయట పడుతున్నాయి. తాజాగా రెయి లింగ్ పెచ్చులు ఊడి పడటంతో దీని పైన కమిటీ విచారణ చేసింది. ఫ్రేమ్‌లు ఊడిపడడం, పగు ళ్లు రావడం పైన ఆర్‌అండ్‌బీ, ఐటీ శాఖతోపాటు సచివాలయాన్ని నిర్మించిన సంస్థ ప్రతినిధులతో కలిపి ఉన్నతాధికారులు విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ తాజాగా సమగ్ర వివరాలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. నివేదికలో కీలక అంశాలను ప్రస్తావన చేసింది.

Defects in the newly constructed Telangana Secretariat have come to light details here

ప్రభుత్వానికి నివేదిక
సచివాలయంలో చాలా చోట్ల పగుళ్లు ఉన్నాయని... కొన్ని పిల్లర్లకు అమర్చిన మోడల్‌ ఫ్రేమ్‌లకూ పగుళ్లు వచ్చాయని పేర్కొంది. భవనంలో బయటికి అందంగా కనిపించేందుకు అంతస్తుల వారీగా ఏర్పాటు చేసిన రెయిలింగ్‌ లకు లోపలి వైపు నట్లు, బోల్టులను అమర్చినట్లు అధికారులు గుర్తిం చారు. ఐదో అంతస్తు నుంచి ఊడిపడిన ఫ్రేమ్‌ లోపలివైపు కూడా నట్లు, బోల్టులతో అమర్చినట్లు వివరించారు. దీంతో బరువు ను మోయలేక ఊడినట్లు నివేదికలో వెల్లడించారు. బాల్కనీల్లో రూఫ్‌ టాఫ్ కు అమర్చిన కొన్ని డిజైన్లు కూడా వంకర్లు తిరిగి, ఊడిపోయే స్థితిలో ఉన్నాయి.

తాజా ఆదేశాలు
కాగా, కొన్ని గోడల్లో నూ పలుచోట్ల పగుళ్లు కనిపిస్తున్నాయి. సచివాలయం లోపలి వైపు పగుళ్ల న్నింటికీ మరమ్మతులు చేపట్టాలని కమిటీ సూచించినట్లు తెలుస్తోంది. అయితే ఆయా మరమ్మ తులకు అయ్యే వ్యయాన్ని సదరు నిర్మాణ సంస్థే భరించాల్సి ఉందని చెబుతున్నారు. సచివాల య భవన నిర్మాణ సమయంలో ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందంలోనూ ఈ నిబంధన ఉన్నట్లు సమాచారం. దీంతో, మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+