Rajnath Singh: దామగుండం నేవీ రాడార్ స్టేషన్ కు రాజ్ నాథ్ సింగ్ శంకుస్థాపన..

కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలంగాణలో పర్యటించారు. వికారాబాద్ జిల్లా దామగుండం అటవీ ప్రాంతంలో వీఎల్ఎఫ్ (వెరీ లో ఫ్రీక్వెన్సీ) నేవీ రాడార్ స్టేషన్ కు సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, స్పీకర్ గడ్డం ప్రసాద్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. అయితే ఈ నేవీ రాడార్ దేశంలో రెండోది. మొదటి నేవీ రాడార్ తమిళనాడులోని తిరునెల్వేలిలో ఉన్న ఐఎన్ఎస్ కట్టబొమ్మన్ లో ఉంది. ఈ రాడార్ 1990 నుంచి అది నావికా దళానికి సహాయంగా నిలుస్తోంది.

దామగుండంలో రాడార్ ఏర్పాటుపై బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఓ వైపు మూసీ నదికి ముఖ్యమంత్రే మరణశాసనం రాస్తూ మరో వైపు సుందరీకరణ ప్రాజెక్టా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. వీఎల్ఎఫ్ రాడార్ స్టేషన్ నిర్మాణంతో మూసీ అంతమైపోతుందని అన్నారు. పదేళ్లు తమపై ఒత్తిడి తెచ్చిన రాడార్ స్టేషన్ నిర్మాణానికి అంగీకరించలేదని అన్నారు. జనావాసాలు లేని ద్వీపాల్లో ఏర్పాటు చేయాల్సిన రాడార్ తెలంగాణలోనా? అని ప్రశ్నించారు.

Defense Minister Rajnath Singh laid the foundation stone for Damagundam Navy Radar Station

ఏ ప్రయోజనాలు ఆశించి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని నిలదీశారు. గంగానది జన్మస్థానం వద్ద 150 కిలోమీటర్లు ఎకో సెన్సిటివ్ జోన్ గా ప్రకటించారని.. గంగానదికి ఒక న్యాయం...మూసీకి ఒక న్యాయామా? అని అడిగారు. రాడార్ ఏర్పాటుకు వ్యతిరేకంగా పర్యావరణ వేత్తలతో కలిసి పోరాటం చేస్తామని ప్రకటించారు. అయితే ఈ రాడార్ ఏర్పాటుకు విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళ కమాండ్ 2010 నుంచి రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది.

గత ప్రభుత్వ హయాంలో పర్యావరణ అనుమతులు, క్లియరెన్స్ వచ్చింది. కానీ భూములు కేటాయించకపోవడంతో శంకుస్థాపన వాయిదా పడింది. రాడార్ ఏర్పాటుకు భూములు కేటాయించాలని ఈ సంవత్సరం జనవరిలో కమోడోర్ కార్తీక్ శంకర్, సర్కిల్ డీఈవో రోహిత్ భూపతి, కెప్టెన్ సందీప్ దాస్ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి మాట్లాడారు. తర్వాత వికారాబాద్ డీఎఫ్ వో, నావల్ కమాండ్ ఏజెన్సీ అధికారులు అటవీ భూముల బదిలీ చేస్తున్నట్లు ఒప్పందం చేసుకున్నారు. దామగండంలో రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉన్న 1,174 హెక్టార్ల అటవీ భూమిని నేవీకి అప్పగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+