సెల్‌ఫోన్ బదులుగా సిమెంట్ గడ్డ: ఆన్‌లైన్ కొనుగోలులో మోసం
ఆన్ లైన్ లో సెల్ ఫోన్ బుక్ చేసుకున్న ఓ యువకుడికి పార్సిల్ లో సిమెంట్ గడ్డలు పంపించారు.
వరంగల్ : దేశం మొత్తం నగదు రహిత లావాదేవీలను అనుసరిస్తుండగా... అదే స్పీడులో మోసాలు సైతం జరుగుతున్నాయి. రోజు గడిచినకొద్దీ ఆన్‌లైన్ మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా హన్మకొండలో ఓ యువకుడు సెల్‌ఫోన్ కొనుగోలు చేసేందుకు ఆన్‌లైన్‌లో డబ్బు చెల్లించాడు.
తీరా అతడి ఇంటికి పార్శిల్ కి వచ్చాక, ఆతృతతో తెరిచి చూస్తే.. అందులో సిమెంటు గడ్డలు దర్శనమిచ్చాయి. దీంతో బిత్తరపోవడం ఆ యువకుడి వంతైంది. వెంటనే అతడు హన్మకొండ పోలీసుకు ఫిర్యాదు చేశాడు.

పోలీసు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం... హన్మకొండ కిషన్‌పురకు చెందిన సీహెచ్. మహేశ్వర్ అనే వ్యక్తి ఈనె 15న ఓ కంపెనీ ద్వారా రూ. 5178 మివ గ సెల్‌ఫోన్‌ను ఆన్‌లైన్‌లో బుక్ చేశాడు. అదే సమయంలో డబ్బును క్రెడిట్ కార్డు ద్వారా ముందుగానే చెల్లించినట్లు చెప్పాడు. ఈ క్రమంలో సెల్‌ఫోన్ వస్తుందని 8 రోజుపాటు వేచి చూస్తుండగా శుక్రవారం ఆయన పనిచేస్తున్న సంస్థ అడ్రస్‌కు ఓ వ్యక్తి సెల్ వచ్చిందని పార్శిల్ ఇచ్చి వెళ్లాడు.
బాక్స్ తెరిచి చూడగా సిమెంటు గడ్డలు వచ్చినట్లు గుర్తించాడు. వెంటనే హన్మకొండ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు బాధితుడు మహేశ్వర్ తెలిపాడు. సదరు సంస్థపై చర్యతీసుకోవాని, నష్టపోయిన తన డబ్బును తిరిగి ఇప్పించాని పోలీసును విజ్ఞప్తి చేశృాడు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు తెలిపారు.












Click it and Unblock the Notifications