పురుగుల మందు తాగబోయిన కార్యకర్త
వరంగల్ జిల్లా ములుగులో జిల్లా ఉద్యమం ఉధృతంగా కొనసాగుతోంది. అఖిల పక్ష నేతల ఆధ్వర్యంలో జూనియర్ కళాశాల సెంటర్లో జాతీయ రహదారి పైన నాయకులు రాస్తారోకో నిర్వహించారు. తొలుత తెలంగాణ తల్లి విగ్రహం నుంచి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో టిడిపి నేతలు సీతక్కతో పాటు జెడ్పీ ఫ్లోర్ లీడర్ సకినాల శోభన్, జేఏసీ నేత కుమార స్వామి తదితరులు ఉన్నారు. వారు పురుగుల మందు పట్టుకొని నిరసన తెలిపారు. ఓ ఉద్యమ నేత పురుగుల మందు తాగే ప్రయత్నం చేయగా నేతలు వారించారు.












Click it and Unblock the Notifications