హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నోట్ల రద్దు: పోస్టాఫీసుల్లో రూ.2.95 కోట్లు పక్కదారి, 17 లక్షల రూ.2వేల నోట్లు స్వాధీనం

తెలంగాణ రాజధాని హైదరాబాదులోని పోస్టాఫీసుల్లో జ‌రుగుతున్న‌ న‌గ‌దు మార్పిడిలో పెద్ద ఎత్తున అక్ర‌మాలు జ‌రుగుతున్నాయ‌ని స‌మాచారం అందుకున్న సీబీఐ, ఆదాయపన్ను శాఖ అధికారులు మొత్తం 11 చోట్ల దాడులు జరిపారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాదులోని పోస్టాఫీసుల్లో జ‌రుగుతున్న‌ న‌గ‌దు మార్పిడిలో పెద్ద ఎత్తున అక్ర‌మాలు జ‌రుగుతున్నాయ‌ని స‌మాచారం అందుకున్న సీబీఐ, ఆదాయపన్ను శాఖ అధికారులు మొత్తం 11 చోట్ల దాడులు జ‌రిపి అన్ని వివరాల‌ను సేక‌రించారు.

చ‌ట్ట‌విరుద్ధంగా ఇటువంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డిన పోస్ట‌ల్ అధికారులు అబ్దుల్ గనీ, రవితేజ, సురేశ్ కుమార్‌, శ్రీ‌నివాస్‌ల‌ను అరెస్టు చేశారు. వీరంతా సీనియర్ సూపరింటెండెంట్ సుధీర్ ప్రోత్సాహంతోనే నగదు మార్చారని అధికారులు గుర్తించారు.

currency

మొత్తం రూ.2.95 కోట్ల నగదును అక్ర‌మంగా మార్చార‌ని చెప్పారు. అధికారుల ఇళ్లు, ఆఫీసుల‌తో పాటు ప‌లు ప్రాంతాల్లోనూ తాము సోదాలు జ‌రిపిన‌ట్లు తెలిపారు. తాము జ‌రిపిన దాడుల్లో మొత్తం 17.02 ల‌క్ష‌ల విలువైన రూ.2 వేల కొత్త నోట్ల‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

పోస్టాఫీసుల్లో కొందరు సిబ్బంది బ్రోకర్లతో కుమ్మక్కు అయ్యారు. హిమయత్ నగర్, గోల్కొండ, కార్వాన్ పోస్టాఫీసు సిబ్బందిపై కేసులు పెట్టారు. మరో ఆరుగురు పరారీలో ఉన్నారు. వారిని ప్రోత్సహించిన సుధీర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని కోసం గాలిస్తున్నారు.

English summary
As part of its crackdown on cash hoarding post demonetisation, the CBI has seized documents, laptops, mobile phones and Rs 17.02 lakh in new Rs 2,000 currency notes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X