వర్షాల ఎఫెక్ట్... తెలంగాణలో పెరుగుతున్న డెంగ్యూ కేసులు... జీహెచ్ఎంసీలోనే ఎక్కువగా...

గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు పంజా విసురుతున్నాయి. ముఖ్యంగా జీహెచ్ఎంసీ,రంగారెడ్డి,మేడ్చల్ పరిధిలో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. గత నెల రోజుల్లో తెలంగాణలో మొత్తం 1900 డెంగ్యూ కేసులు నమోదవగా.. ఒక్క హైదరాబాద్‌లోనే 450 కేసులు నమోదయ్యాయి. గత వారం రోజుల్లో హైదరాబాద్‌లో డెంగ్యూ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గెనీగల్స్ గ్లోబల్ ఆస్పత్రి కన్సల్టెంట్ నిపుణులు డా.ప్రశాంత్ చంద్ర దీనిపై మాట్లాడుతూ... వర్షాకాలంలో పారిశుద్ధ్యం సరిగా లేకపోవడం వల్లే నగరంలో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయని అన్నారు.

గడిచిన వారం రోజుల్లో 40 నుంచి 50 శాతం వరకు ఈ వ్యాధులు పెరిగాయన్నారు. డెంగ్యూ దోమలు సాయంత్రం,తెల్లవారుజాము సమయాల్లో ఎక్కువ చురుగ్గా ఉంటాయన్నారు. ఆ సమయంలో వాకింగ్‌కి వెళ్లేవారు,బయట తిరిగేవారు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పారిశుద్ధ్యం సరిగా లేనిచోట డెంగ్యూ కారక దోమలు ఎక్కువగా ఉంటాయన్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం,నీరు నిల్వం ఉండకుండా చేయడం ద్వారా దోమలను అరికట్టవచ్చన్నారు.

dengue case on rise in telangana especially in ghmc and medchal

దోమలు ఉండే ప్రదేశంలో శరీరాన్ని పూర్తిగా కప్పే దుస్తులు ధరించాలన్నారు. జ్వరం వచ్చినవారు తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకుని మెడిసిన్ వాడాలన్నారు. వ్యాధిని త్వరగా గుర్తించడం ద్వారా ముప్పును తగ్గించవచ్చునని చెప్పారు. డెంగ్యూ ప్రభావం తీవ్రంగా ఉండి కొన్నిసార్లు మరణం కూడా సంభవిస్తుందని వైద్యులు చెబుతున్నారు.గత నెలలో హైదరాబాద్‌లో భారీగానే డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. కరోనా ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గకముందే సీజనల్ వ్యాధులు విజృంభించడం ఆందోళన కలిగిస్తోంది.

జీహెచ్ఎంసీలో డెంగ్యూ కట్టడికి వైద్యారోగ శాఖ ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. ఫీవర్ సర్వేతో పాటు యాంటీ లార్వా చర్యలు చేపడుతోంది. ఇప్పటికైతే డెంగ్యూ నియంత్రణలోనే ఉందని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.

తెలంగాణ వెదర్ రిపోర్ట్ :

తెలంగాణలో రాబోయే మరో మూడు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం(ఆగస్టు 21) పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. శుక్రవారం (ఆగస్టు 20) ఉదయం 8గంటల వరకు ఆదిలాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసినట్లు వెల్లడించింది.

తెలంగాణకు పొరుగునే ఉన్న మహారాష్ట్రలోని విదర్భ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని, ప్రస్తుతం అది సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉందని వాతావరణ శాఖ తెలిపింది. విదర్భ నుంచి ఉత్తర తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతుందని పేర్కొంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మీదుగా 3.1 ఎత్తులో ద్రోణి ఆవరించి ఉందని... దీని ప్రభావంతో రాగల మూడు రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+