ఐ లవ్ యూ శంకర్: కూతుర్ని చంపి తాను ఉరేసుకుని ఆత్మహత్య

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: జీవితంపై విసుగు చెందిన ఓ మహిళ తన కూతురిని చంపి తాను ఆత్మహత్య చేసుకుంది. ఎంబిఎ గ్రాడ్యుయేట్ అయిన మహిళ, ఆమె మూడేళ్ల కూతురు హైదరాబాదులోని దిండిగల్‌లో గల తన ఇంటిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

దుద్డెడ సృజన (30) తన కూతురు శ్రీజకు ముందు ఉరేసి, ఆ తర్వాత తాను ఉరేసుకుని మరణించినట్లు పోలీసులు భావిస్తున్నారు. పని నుంచి తిరిగి వచ్చిన భర్త శంకర్ తల్లీకూతుళ్లు ఉరేసుకున్న దృశ్యాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

 సృజన సూసైడ్ నోట్

సృజన సూసైడ్ నోట్

సంఘటనా స్థలం నుంచి పోలీసులు సృజన రాసిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. జీవితం తాను కలలు కన్నట్లు లేదని, అందుకే జీవితాన్ని ముగించాలని అనుకున్నానని అందులో రాసింది.

 శంకర్‌ను పెళ్లి చేసుకుని...

శంకర్‌ను పెళ్లి చేసుకుని...

ఇంటర్మీడియట్ చదివిని శంకర్‌ను సృజన వివాహం చేసుకుంది. శంకర్ సూరారంలోని హోటల్లో పనిచేస్తున్నాడు. సృజన ఇంట్లోనే ఉంటూ వస్తోంది. దంపతులు తమ కూతురితో కలిసి దిండిగల్ పోలీసు స్టేషన్ పరిధిలో గల సూరారం కాలనీలో నివసిస్తన్నారు.

 మొదటి నుంచీ అసంతృప్తే

మొదటి నుంచీ అసంతృప్తే

సృజనకు జీవితంపై ఎక్కువ ఆశలు ఉండేవి. తాను పనిచేసి, సుఖంగా జీవించాలని ఆమె కోరుకునేది. కుటుంబ సభ్యుల ఒత్తిడితో ఆమె శంకర్‌ను పెళ్లి చేసుకుంది. పెళ్లయినప్పటి నుంచి కూడా ఆమె అసంతృప్తిగానే ఉంటూ వచ్చంది. దాంతో డిప్రెషన్‌‌కు గురయ్యేది.

 ఇంటికొచ్చి చూసేసరికి...

ఇంటికొచ్చి చూసేసరికి...

ఎప్పటి మాదిరిగానే గురువారం శంకర్ పనికి వెళ్లి అర్థరాత్రి తిరిగి వచ్చాడు. ఇంట్లోకి అడుగు పెట్టగానే భార్య కూతురు చీరతో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించారు. అనుమానాస్పద మృతిగా సృజన తండ్రి నర్సింహులు ఫిర్యాదు చేశారు.

 భర్తే హత్య చేశాడని ఆరోపణలు

భర్తే హత్య చేశాడని ఆరోపణలు

భర్త శంకర్ హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని, అందుకే తాము రాకుండానే మృతదేహాన్ని పోలీసులు తరలించారని సృజన తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించారు. తాను మృతదేహాలను చూసి శంకర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సృజన సోదరుడు అంబయ్యకు ఫోన్ ద్వారా చెప్పాడు. సృజన కుటుంబ సభ్యులు రాకుండానే పోలీసులు మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.

 ఐ లవ్ యూ శంకర్.. అంటూ

ఐ లవ్ యూ శంకర్.. అంటూ

ఐ లవ్ యూ శంకర్.. చేసిన ప్రమాణాలకు, వేసుకున్న ముడులకు న్యాయం చేయలేకపోతున్నానని, నాలుగో ముడి వేసుకుంటున్నానని సృజన సూసైడ్ నోట్‌లో రాసింది. "నీకు చాలా భవిష్యత్తు ఉంది. దాన్ని నాశనం చేసుకోకు. నా వల్ల నీవు చాలా ఇబ్బంది పడ్డావు. నా కథ ముగిసిపోతోంది. ఈ విషయంలో ఎవరితో గొడవ పడవద్దు. నీవు మళ్లీ పెల్లి చేసుకోవాలి" అంటూ రాసింది.

 భారం కాకూడదనే...

భారం కాకూడదనే...

"నీకు భారం కాకూడదనే కూతురిని కూడా నా వెంటే తీసుకుపోతున్నా. అమ్మా, నానాన్న మీరు చెప్పిన ధైర్యం నాకు సరిపోవడం లేదు. అందుకే దాన్ని ఆపేస్తున్నాను అని సృజన తన సూసైడ్ నోట్లో రాసింది. నీ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నానని భర్తను ఉద్దేశించి రాసింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
An MBA graduate and her three-year-old daughter were found hanging in their house in Dundigal in the early hours of Friday

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి