వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లంచాలకు స్పోర్ట్స్ కోటాలో మెడికల్ సీట్లు: శాట్ డిప్యూటీ డైరెక్టర్ అరెస్ట్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: గత సంవత్సరం తెలంగాణ స్పోర్ట్స్‌ కోటాలో మెడికల్‌ సీట్లు అమ్ముకున్నారనే ఆరోపణల నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) బుధవారం తెలంగాణ స్పోర్ట్స్‌ అథారిటీ అధికారుల ఇళ్లపై ఒకేసారి మెరుపు దాడులు నిర్వహించింది.

ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌ పూర్ణచందర్‌ రావు మాట్లాడుతూ.. శాట్ డిప్యూటీ డైరెక్టర్‌ వెంకట రమణ నివాసం సహా మరో ఐదు చోట్ల తనిఖీలు నిర్వహించామన్నారు. 'స్పోర్ట్స్‌ కోటాలో 12 మందికి మెడికల్‌ సీట్లు అమ్ముకున్నట్లు గుర్తించాం. బాధితులు భరత్‌ చంద్రారెడ్డి, హర్షితారాజ్‌ల ఫిర్యాదుతో కేసు నమోదు చేశాం' ఏసీబీ డీజీ చెప్పారు.

Deputy director of Telangana Sports Authority held

అధికారులు వెంకట రమణ, శోభ, చంద్రారెడ్డి, విమలాకర్‌లు రూ. లక్షలు లంచం డిమాండ్‌ చేశారని ఏసీబీ డీజీ తెలిపారు. 2017 స్పోర్ట్స్‌ సర్టిఫికెట్లకు సంబంధించిన డాక్యుమెంట్లు సేకరించామన్నారు.

శాట్ డిప్యూటీ డైరెక్టర్‌ వెంకట రమణను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. ఇంకా ఎవరైనా బాధితులుంటే ఏసీబీని సంప్రదించాలని ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌ పూర్ణచందర్‌ రావు సూచించారు.

English summary
The Anti-Corruption Bureau today arrested a Deputy Director of Sports Authority of Telangana for allegedly taking bribe of Rs 1 lakh from the parent of a sports student.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X