హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీఎంకు అరుదైన బహుమతి: కృతజ్ఞతలు తెలిపిన కేసీఆర్‌

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధనతో చరిత్ర సృష్టించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అరుదైన బహుమతి లభించింది. గియాసుద్దీన్ తుగ్లక్ కాలం నాటి బంగారు నాణేన్ని టీఆర్‌ఎస్ ఎం ఫౌండేషన్ వ్యవస్థాపకులు తక్కెళ్లపల్లి దేవేందర్‌రావు సీఎం కేసీఆర్‌కు శనివారం బహూకరించారు.

కేసీఆర్‌ను ప్రభుత్వ సలహాదారుడు పాపారావు, తెలంగాణ ప్రభాకర్‌లతోపాటు కలిసిన సందర్భంగా ఈ నాణేన్ని అందించారు. తెలంగాణ సాధకుడు కేసీఆర్‌కు అని రాసి ఇచ్చారు. అరుదైన నాణేన్ని బహూకరించిన దేవేందర్‌రావుకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు.

అంతేకాదు దేవేందర్‌రావు సేకరించిన ఇతర నాణేల గురించి ఆయన ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. దేవేందర్‌రావుకు పురాతనకాలం నుంచి నేటివరకు చెలామణి అయిన నాణేలు, ఇతర వస్తువులను సేకరించే అలవాటు ఉంది. ఆయన వద్ద వివిధ కాలాలకు సంబంధించిన నాణేలున్నాయి.

కాకతీయ సామ్రాజ్య పతనం తర్వాత ఓరుగల్లును ఆక్రమించిన గియాసుద్దీన్ తుగ్లక్ కొడుకు, అప్పటి యువరాజు మహ్మద్ బిన్ తుగ్లక్ ఆధ్వర్యంలో ఆనాటి ఓరుగల్లు ప్రాంతంలో ముల్కీ తిలాంగ్ మింట్ ఏర్పాటు అయింది. ఆ మింట్‌లోనే నాణేలు తయారయ్యేవి.

ఇప్పుడు ముఖ్యమంత్రికి దేవేందర్‌రావు అందించిన నాణెం.. ముల్కీ తిలాంగ్ మింట్‌లో 1320-25 మధ్యకాలంలో తయారు చేశారు. సదరు నాణెంపై ముల్కీ తిలాంగ్ మింట్ (లాండ్ ఆఫ్ తెలుగు) అని ముద్రించి ఉండటం విశేషం.

 కేసీఆర్‌కు అరుదైన బహుమతి

English summary
Devender rao presented a gold coin to cm kcr.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X