వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ధరణి పోర్టల్ రద్దు.!రైతు సంఘర్షణ సభలో రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన.!

|
Google Oneindia TeluguNews

వరంగల్/హైదరాబద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందిచిన ధరణి పోర్టల్ లో అనేక అవతవకలు చోటుచేసుకుంటున్నాయని, అసలైన భూయజమానికి చెందిన భూముల వివరాలు గల్లంతవుతున్న దాఖలాలు అనేకం చోటుచేసుకున్నప్పటికి పట్టించుకున్న నాధుడు లేక భూయజమానులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని వరంగల్ రైతు సంఘర్షణ సభలో రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇదే పరిస్ధితి నెలకొనడంతో భూ హక్కుదారులు దిక్కుతోచని స్థితిలో మిగిలిపోయారని రేవంత్ రెడ్డి తెలిపారు. జవాబుదారీ తనంగా ఉండాల్సిన అధికారులు బాద్యతారాహిత్యంగా వ్యవహరిస్తుంటే భూయజమానులు ఎవరికి తమ సమస్యలు చెప్పుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతుల సమస్యలను ఏకరువు పెడుతూ రైతు డిక్లరేషన్ ను రేవంత్ రెడ్డి ప్రకటించారు.

Dharani portal canceled!Revanth sensational statement in the Warangal meeting.!

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం భూయజమానుల పట్ల శరాఘాతంగా మారిన ధరణి పోర్టల్ ను రద్దు చేస్తామని పీసిసి అద్యక్షుడు రేవంత్ రెడ్డి వరంగల్ రైతు సంఘర్షణ సభలో ప్రకటించారు. ధరణి పోర్టల్ లో కనినించాకుండాపోయిన భూములను తిరిగి హక్కుదారులకు ఇచ్చేందుకు వందకు వందశాతం ప్రయత్నిస్తుందని రేవంత్ రెడ్డి తెలిపారు. ధరణి పోర్టల్ లో తమ భూమి వివరాలు కనిపించకపోడంతో లక్షలాది తెలంగాణ ప్రజలు ఆందోళనలో ఉన్నారని, ప్రభుత్వ యంత్రాంగంలో ఏ ఒక్కరూ కూడా వానికి సమాధానం చెప్పేందుకు ఆసక్తిగా లేదని, అలాంటి వారి కోసం, ఎవరి భూమిని వారికి న్యాయ బద్దంగా ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ రూపొందించి ముందుకు వెళ్తుందని వరంగల్ రైతు సంఘర్షణ సభలో రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.

English summary
PCC president Revant Reddy announced at the Warangal Farmers' Conflict meeting that the Dharani portal, which has become a nightmare for landlords since the Congress party came to power, will be scrapped.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X