సమావేశంలో దిగ్విజయ్ నిద్ర: విహెచ్, జానా కూడా
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఏఐసీసీ నేత దిగ్విజయ్ సింగ్, తెలంగాణ కాంగ్రెసు పార్టీ సీనియర్ నేతలు జానారెడ్డి, వి హనుమంత రావులు ఓ కునుకు తీశారు. హైదరాబాదులో తెలంగాణ ప్రాంతా కాంగ్రెసు పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరుగుతోంది. ఈ సమావేశం జరుగుతున్న సమయంలో డిగ్గీ కూర్పాట్లు తీశారు. జానా, విహెచ్‌లు కూడా ఓ కునుకు తీశారు.
భవిష్యత్తు మనదే: జైపాల్ రెడ్డి
సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పట్ల ఎవరు నిరూత్సాహపడవద్దని, భవిష్యత్తులో కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుందని కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి విస్తృతస్థాయి సమావేశంలో అన్నారు. హైదరాబాదు తెలంగాణకు గుండెకాయ వంటిదన్నారు. ఇప్పటికీ తెలుగేతరులు హైదరాబాదుకు వస్తున్నారని, భవిష్యత్తులోను వస్తారన్నారు.

హైదరాబాదులోని అన్ని వర్గాల ప్రజల రక్షణ బాధ్యత కాంగ్రెసు పార్టీ తీసుకుంటుందని జైపాల్ రెడ్డి చెప్పారు. మానవతావాదాన్ని నమ్మె పార్టీ కాంగ్రెసు పార్టీ అని ఆయన అన్నారు. హైదరాబాదు కేంద్రపాలిత ప్రాంతం కాకుండా అడ్డుకున్నది తానేనని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తెరాస పాత్ర ఏమాత్రం లేదన్నారు.
తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు లేదని జోస్యం చెప్పారు. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితితో జత కడుతుందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ గెలవాలంటే కాంగ్రెసు నేతలు సెటిలర్లకు అండగా నిలవాలన్నారు.












Click it and Unblock the Notifications