విధి వంచిత: ఆడపిల్లకు జన్మనిచ్చిన చెన్నకేశవులు భార్య రేణుక

చెన్నకేశవులు భార్య రేణుక ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఓ ఆడపిల్లపై చేసిన దారుణానికి చెన్నకేశవులు ఎన్కౌంటర్ లో మరణించగా అప్పటికే గర్భవతి అయిన రేణుక ఇప్పుడు ఆడపిల్లకు ప్రాణం పోయటం, మానవ మృగాలున్న సమాజంలో మైనర్ అయిన రేణుక ,ఆమె బిడ్డ ఎలా బ్రతుకుతారు అనే ఆందోళన కలుగుతుంది. దేశంలో సంచలనం సృష్టించిన దిశా కేసు నిందితుడు చెన్నకేశవులు భార్యగా ఆమెకు, అతని బిడ్డగా ఆ పసి పాపకు సమాజం ఎలాంటి స్థానం ఇస్తుందనేది కూడా ఆలోచించాల్సిన విషయమే.

మహిళాదినోత్సవం ముందు రోజు ఆడపిల్లకు జన్మనిచ్చిన చెన్నకేశవులు భార్య రేణుక

మహిళాదినోత్సవం ముందు రోజు ఆడపిల్లకు జన్మనిచ్చిన చెన్నకేశవులు భార్య రేణుక

దిశ సామూహిక అత్యాచారం, హత్య కేసులో నిందితుడు చెన్నకేశవులు ఎన్కౌంటర్ లో మృతి చెందిన విషయం తెలిసిందే . దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో చెన్నకేశవులు భార్య ఆ సమయంలో గర్భిణీ. తన భర్త ఎన్కౌంటర్ ని తీవ్రంగా వ్యతిరేకించిన ఆమె పోలీసులను నిలదీసింది. ఒక ప్రాణానికి నాలుగు ప్రాణాలా అని ప్రశ్నించింది. తన భరతలాగే తనను ఎన్కౌంటర్ చెయ్యాలని ఆక్రోశించింది. ఇక ఇప్పుడు ఆమె ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది. మహిళా దినోత్సవానికి రేడు రోజుల ముందు పండంటి పాపకు ప్రాణం పోసింది.

తల్లీ దండ్రీ లేని రేణుక చెన్నకేశవులును ప్రేమించి పెళ్ళాడిన విధి వంచిత

తల్లీ దండ్రీ లేని రేణుక చెన్నకేశవులును ప్రేమించి పెళ్ళాడిన విధి వంచిత

మహబూబ్ నగర్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం చెన్నకేశవులు భార్య రేణుకకు ఆడబిడ్డ జన్మించింది. హైదరాబాద్ శివార్లలో దిశ పై అత్యాచారం చేసి పాశవికంగా హత్య చేసిన సంఘటనలో చెన్నకేశవులు ఏ2 నిందితుడు. అతని భార్య అప్పుడు గర్భంతో ఉంది. 13 సంవత్సరాలు వయసు ఉన్న బాలికను చెన్నకేశవులు పెళ్లి చేసుకున్నాడు. వీరిది ప్రేమ వివాహం . ఆమెకు తల్లీ,దండ్రీ లేరు. దీంతో ఆమె తన నానమ్మ ,తాతయ్య ఇంట్లో ఉండేది. ఈ క్రమంలోనే ఆమెను చెన్నకేశవులు పెళ్ళిచేసుకున్నాడు. ఆమెకు ఒక చెల్లి, తమ్ముడు ఉన్నారు.

చెన్నకేశవులు భార్య రేణుక మైనర్ అని గుర్తించిన అధికారులు

చెన్నకేశవులు భార్య రేణుక మైనర్ అని గుర్తించిన అధికారులు

ఎన్కౌంటర్ తర్వాత విచారణ జరిపిన పోలీసులు చెన్నకేశవుల భార్య గురించి కొన్ని ఆసక్తిరమైన నిజాలు తెలుసుకున్నారు. చెన్నకేశవులు కుటుంబ సభ్యులతో మాట్లాడారు అధికారులు . చెన్నకేశవులు భార్య మైనర్ అని, ఆ బాలికకు సంబంధించిన వివరాలను పాఠశాల నుంచి తీసుకున్న అధికారులు ఆమె మైనర్ అని గుర్తించారు. ఆమె వయసు 13 అని ఆమె మైనర్ అని తేలడంతో పోలీసులు మైనార్టీ తీరేవరకూ బాలసదనంలో ప్రభుత్వ సంరక్షణలో ఉంచాలని ప్రయత్నం చేశారు. కానీ ఆమె అందుకు ఒప్పుకోలేదు.

పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చిన రేణుక

పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చిన రేణుక

ఇప్పుడు ఆమెకు ఆడపిల్ల పుట్టింది. తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నారని వైద్యులు చెప్పారు. చెన్నకేశవులు భార్య రేణుక విధి వంచిత .. చిన్నతనంలోనే తల్లి దండ్రులను పోగొట్టుకుంది. బ్రతికి ఉన్నంత కాలం రక్షణ ఇస్తాడనుకున్న భర్త మరో ఆడదానిపై చేసిన పైశాచిక ఘటనతో ఎన్కౌంటర్ లో మరణించాడు. అన్నిటికంటే ఆమె ఒక మైనర్ , ఇప్పుడు ఓ బిడ్డ తల్లి, చెన్నకేశవులును నమ్మి ప్రేమించి పెళ్లి చేసుకుని చేసిన పనికి ఇప్పుడు ఆమె జీవితం ప్రశ్నార్ధకం అయ్యింది.

మైనర్ రేణుక , ఆమె బిడ్డ భవిష్యత్ ఏంటి ?

మైనర్ రేణుక , ఆమె బిడ్డ భవిష్యత్ ఏంటి ?

నా అన్న వాళ్ళు లేని రేణుక ఇప్పుడు తన, తన బిడ్డ భవిష్యత్ ఏంటో అర్ధం కాని స్థితిలో వేదన చెందుతుంది. రేణుక భవిష్యత్, ఆ బిడ్డ భవిష్యత్ ప్రశ్నార్ధకం కాకుండా చూడాల్సిన బాధ్యత ఎవరిది ? ఆడపిల్లను అమానవీయంగా సామూహిక అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు చెన్నకేశవులు బ్రతికి లేకున్నా , అతని భార్యగా, బిడ్డగా ఈ ఆడకూతుళ్ళ విషయంలో సమాజం సానుకూలంగా వ్యవహరిస్తుందా ? అతను చేసాడని చెప్తున్న పాపానికి వీరికి శిక్ష పడుతుందా ? ఆ తల్లీ, బిడ్డలను రక్షించే నాధుడు ఎవరు ? ఇవన్నీ ప్రస్తుతానికి ప్రశ్నలే ? కాలమే వీటికి సమాధానం చెప్పాలి .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+