ఒక ప్రాణానికి నాలుగు ప్రాణాలా .. వాళ్ళందరినీ ఎన్ కౌంటర్ చెయ్యండి .. చెన్నకేశవులు భార్య ధర్నా
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితుల ఎన్ కౌంటర్ తో మృతుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఈ ఎన్‌కౌంటర్ లో మృతి చెందిన వారి కుటుంబాల నుండి కూడా వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఒక ప్రాణానికి నాలుగు ప్రాణాలు తీశారని మృతుల కుటుంబాలు ఆవేదన చెందుతున్నాయి. షాద్ నగర్, చటాన్ పల్లి బ్రిడ్జి వద్ద జరిగిన ఎన్ కౌంటర్ లో ఆరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవులును పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. ఈ ఎన్కౌంటర్ పై చెన్నకేశవులు భార్య తీవ్ర ఆందోళనవ్యక్తం చేస్తున్నారు . గ్రామంలో ధర్నా చేసిన ఆమె పోలీసులను , ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.

నిండు గర్భిణీ అన్న జాలి లేకుండా భర్తను చంపారన్న చెన్నకేశవులు భార్య
చెన్నకేశవులు భార్య గర్భిణి కావటంతో చెన్నకేశవులు ఆమెను పుట్టింటికి పంపిన క్రమంలో జరిగిందీ ఘటన . దీనిపై చెన్నకేశవులు భార్య లక్ష్మీ కన్నీరు మున్నీరు అవుతుంది. నిండు గర్భిణీ అన్న జాలి కూడా లేకుండా తన భర్తను చంపారని లబోదిబోమంటుంది. తన భర్త తప్పు చేశాడని పోలీసులు కోర్టు నమ్మితే దానికి తగిన శిక్ష విధిస్తే బాగుండేదని ఆమె అంటుంది. కానీ ఇలా ఎన్ కౌంటర్ చేయడం మంచిది కాదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

రేప్ కేసుల నిందితులను అందరినీ కాల్చి చంపండి అని ఆగ్రహం
ఇది అన్యాయం అని ఆమె పేర్కొంది. తన భర్తను చంపినట్టే తనను కూడా చంపాలని ఆవేదన వ్యక్తం చేసింది.అమ్మాయిపై అత్యాచారం చేసినందుకు నా మొగుడితో సహా నలుగురిని చంపారని.. ఇలాంటి కేసుల్లో నిందితులుగా జైళ్లలో ఉన్న వారిని అందరినీ కూడా చంపేయాలని చెన్నకేశవులు భార్య ఆవేదన వ్యక్తం చేస్తుంది.దిశ కేసు నిందితుల్లో ఒకరైన చెన్నకేశవులు భార్య పోలీసుల తీరుపై ధర్నా చేసింది.

చంపటం, పూడ్చటం అంతా మీ ఇష్టమేనా .. అసలు మీరెవరు అని పోలీసులకు ప్రశ్న
తన గ్రామస్థులతో కలిసి స్వగ్రామంలో రహదారిపై బైఠాయించి తన భర్త శవాన్ని తనకే అప్పగించాలని, ఇష్టమొచ్చినకాడ పూడ్చిపెట్టడానికి అసలు పోలీసులు ఎవరూ అంటూ ఆమె నిలదీసింది . చంపడం, పూడ్చడం కూడా మీ ఇష్టమేనా , మీ బాధ్యతనేనా ఆమె పోలీసుల తీరును ప్రశ్నించింది. నిండు గర్భిణి అని కూడా చూడకుండా తన భర్తను చంపారని, మీకు మానవత్వం ఉందా అని పోలీసులపై తీవ్ర పదజాలంతో విమర్శలు గుప్పించింది.
Recommended Video

నా భర్తతో పాటే పూడ్చి పెట్టండి అంటున్న చెన్నకేశవులు భార్య
ఈ ఎన్ కౌంటర్ జరిగినందుకు ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, ప్రాణాలు తీయటం సంతోషమా అని ఆమె ప్రశ్నించింది. కానీ గతంలో ఇలాంటి ఘటనలు చేసిన నిందితులను కూడా ఇలానే కాల్చేయండి అంటూ ఆమె ధర్నా చేసింది . భర్త శవాన్ని తనకు అప్పగించకపోతే తనను కూడా ఆ గోతిలోనే పూడ్చిపెట్టాలని చెన్నకేశవులు భార్య పోలీసులను డిమాండ్ చేస్తుంది. ఒక అమ్మాయి కోసం నలుగురిని పొట్టన పెట్టుకున్నారని చెన్నకేశవులు భార్య ఆవేదనతో చెప్పింది. దిశ చెల్లెలికి బదులు పోలీసులకు ఫోన్ చేస్తే ఈ ఘోరం జరిగేది కాదని ఆమె పేర్కొంది.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications