దిశా కేసు... ఎన్‌హెచ్‌ఆర్‌సీకి కీలక సాక్ష్యాలు .. మొత్తం ఎపిసోడ్ పై నివేదికలు ఇచ్చిన సైబరాబాద్ పోలీ
దిశ అత్యాచారం,హత్య,ఆపై నిందితుల ఎన్కౌంటర్ గురించి జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణ బృందం అన్ని అంశాలపై క్షుణ్ణంగా విచారణ జరుపుతుంది. ఇప్పటికే సంఘటన స్థలాలను పరిశీలించి,ఆసుపత్రిలో భద్రపరిచిన మృతదేహాలను పరిశీలించి,ఇటు దిశ తల్లిదండ్రుల తోనూ, అటు ఎన్కౌంటర్ మృతుల తల్లిదండ్రులతోనూ మాట్లాడారు జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యులు. ఇక తాజాగా పోలీసులతో కూడా మాట్లాడిన సభ్యులు పోలీసుల వద్ద నుండి కీలక ఆధారాలను తీసుకున్నారు.
ఎన్‌హెచ్‌ఆర్‌సీ సభ్యుల బృందాన్ని కలిసి పోలీసులు దిశ హత్య కేసుకు సంబంధించి ఆమెపై రేప్ జరిగినట్టు,అలాగే హత్యను కూడా నిందితులే చేసినట్లుగా కీలక ఆధారాలు ఇచ్చారు. ఇక అంతే కాదు ఫోరెన్సిక్ నిపుణులు ఇచ్చిన నివేదికను,దిశ కాల్చివేత కు సంబంధించిన ఆధారాలతో సహా అన్ని ఆధారాలను సైబరాబాద్ పోలీసులు ఎన్‌హెచ్‌ఆర్‌సీ బృందానికి ఇచ్చారు. దిశ కేసులో కీలకంగా ఉన్న శాస్త్రీయ ఆధారాలు అన్నింటిని ఎన్‌హెచ్‌ఆర్‌సీ ముందు పెట్టిన సైబరాబాద్ పోలీసులు సంఘటనా స్థలంలో దొరికిన రక్తం మరకలను, లారీ క్యాబిన్లో దొరికిన రక్తం మరకలను కూడా సేకరించి జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యులు ముందుంచారు.

ఘటనా స్థలం తో పాటు లారీ జరిగిన సీసీటీవీ ఫుటేజీని కమిషన్ ముందు ఉంచిన పోలీసులు, కొత్తూరు సమీపంలో నిందితులు కొన్న పెట్రోల్ తాలూకు సిసిటివి ఫుటేజ్ ను కూడా అందించారు. ఇక అంతే కాదు రక్తపు మరకల ఆధారంగా డీఎన్ఏ రిపోర్ట్ తో పాటుగా అన్ని నివేదికలను పోలీసులు ఎన్ హెచ్ ఆర్ సి సభ్యులకు ఇచ్చారు. ఇక అంతే కాదు ఈ కేసుకు సంబంధించి, అన్ని రకాలైన వివరాలను తేదీలు, టైం లతో సహా ఎన్‌హెచ్‌ఆర్‌సీ ముందు ఉంచిన పోలీసులు దిశ అత్యాచారం,హత్య చేసింది వారేనని,సీన్ రీ కన్స్ట్రక్షన్ చేయడానికి తీసుకునే క్రమంలో దాడిచేసి తప్పించుకునే ప్రయత్నం చేయగా ఎన్కౌంటర్ చేశామని ఎన్కౌంటర్ కు సంబంధించిన ఆధారాలను సైతం జాతీయ మానవ హక్కుల కమిషన్ ముందుంచారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications