టీఆర్ఎస్ లో త్వరలో అసమ్మతి బ్లాస్ట్; కేసీఆర్ భయం అందుకే: బీజేపీనేత మురళీధర్ రావు
తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ బిజెపి నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పదేపదే బిజెపి నేతలు టిఆర్ఎస్ పార్టీలో అసమ్మతి పెరిగిపోతుందని, షిండే లు తయారవుతున్నారని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక తాజాగా మరోమారు బీజేపీ అగ్రనేత టిఆర్ఎస్ పార్టీ పై బాంబు పేల్చారు. టిఆర్ఎస్ పార్టీలో త్వరలో భూకంపం రాబోతోంది అంటూ బీజేపీ మధ్య ప్రదేశ్ వ్యవహారాల ఇన్చార్జి మురళీధర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్ కు బీజేపీ అంటే భయం, టీఆర్ఎస్ లో షిండేలు
బీజేపీ పై వ్యాఖ్యలు చేసే ముందు టిఆర్ఎస్ నేతలు ఒకసారి ఆలోచించుకోవాలి అంటూ హితవు పలికారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కు బిజెపి అంటే భయం పట్టుకుందని, బీజేపీయేతర రాష్ట్రాలు నీతి ఆయోగ్ సమావేశానికి హాజరైన ప్పటికీ, కెసిఆర్ మాత్రమే గైర్హాజరయ్యారు అంటూ మండిపడ్డారు. సీఎం కేసీఆర్ బిజెపి అంటే భయపడుతున్నారు అని పేర్కొన్న మురళీధర్ రావు టిఆర్ఎస్ పార్టీలో షిండేలను బిజెపి తయారు చేయడం లేదంటూ వ్యాఖ్యలు చేశారు.

టీఆర్ఎస్ లో పెరుగుతున్న అసమ్మతితో టెన్షన్
టిఆర్ఎస్ పార్టీలో అసమ్మతి పెరిగిపోయిందని, ఆ అసమ్మతి త్వరలో ఎప్పుడైనా బయటపడే అవకాశం ఉందని, ఒక్కసారిగా అసమ్మతి బ్లాస్ట్ అవుతుంది అంటూ బీజేపీ నేత మురళీధర్ రావు పేర్కొన్నారు.
అందుకే కేసీఆర్ లోలోపల భయపడుతున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రమే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించారని మండిపడిన బీజేపీ నేత మురళీధర్ రావు కేంద్రంపై కేసీఆర్ కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Recommended Video


కేటీఆర్ కు, కేసీఆర్ కు ఆర్థిక శాస్త్రం ఏ మాత్రం తెలియదు
కేంద్రం బిఎస్ఎన్ఎల్, ఎల్ఐసీ సంస్థలను అమ్మేస్తున్నట్టు దుష్ప్రచారం చేస్తున్నారని, కేటీఆర్ కు, కేసీఆర్ కు ఆర్థిక శాస్త్రం ఏ మాత్రం తెలియదంటూ ఎద్దేవా చేశారు మురళీధరరావు. దేశంలో రూపాయి విలువ పడిపోతుందని చెబుతున్న టిఆర్ఎస్ పార్టీ నేతలు, విదేశీ మారక నిల్వలు తగ్గిపోతున్నా, దేశం మాత్రం ఆర్థిక సంక్షోభం వైపుగా వెళ్లడం లేదనే విషయాన్ని గుర్తించాలని పేర్కొన్నారు.కెసిఆర్ తాటాకు చప్పుళ్ళకు భయపడే పరిస్థితి లేదని ఆయన పేర్కొన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని చూపించడానికి తప్పుడు రాజకీయ ప్రచారం చేస్తూ యుద్ధం చేస్తున్నారని మురళీధర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కెసిఆర్ తాటాకు చప్పుళ్ళకు భయపడే పరిస్థితి లేదు
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం త్వరలో రాబోతుందని పేర్కొన్న బీజేపీ నేత మురళీధర్ రావు, తెలంగాణ ప్రజలు ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇక వచ్చే ఎన్నికలలో సిద్దిపేటలో టిఆర్ఎస్ పార్టీ ఓటమి ఖాయమని బీజేపీ నేత మురళీధర్ రావు వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో టిఆర్ఎస్ ఇచ్చిన వాగ్దానాలు నెరవేరలేదని, టిఆర్ఎస్ ఇచ్చిన వాగ్దానాలపై తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని మురళీధర్ రావు స్పష్టం చేశారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications