Fish Medicine: చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం.. 5 లక్షల మంది వస్తారని అంచనా..
మృగశిర కార్తి సందర్భంగా బత్తిని సోదరులు అందించే చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమైంది. హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఉదయం చేప మందు పంపిణీ మొదలు పెట్టారు. చేప ప్రసాదం భారీ సంఖ్యలో ఆస్తమా వ్యాధిగ్రస్తులు తరలొచ్చారు. చేప ప్రసాదం పంపిణీ కోసం అధికారులు 5 క్వింటాళ్ల చేపలను అందుబాటులో ఉంచారు. వీటితో 5 లక్షల మందికి చేప ప్రసాదం అందించవచ్చని చెప్పారు.
చేప ప్రసాదం పంపిణీ కోసం 34 కౌంటర్లు ఏర్పాటు చేశారు. 32 క్యూలైన్లు ఏర్పాటు చేసి టోకెన్లు కూడా అందిస్తున్నారు. అధికారులు ఒక్కో టోకెన్ కు రూ.40 వసూలు చేస్తున్నారు. ఉదయం 10 గంటల వరకు 23 వేల మందికి చేప ప్రసాదం పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. చేప ప్రసాదం కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, బీహార్, చత్తీస్ ఘడ్, ఒడిశా నుంచి ఆస్తమా బాధితులు తరలొచ్చారు.

ఆస్తమా వ్యాధిగ్రస్థులతో పాటు వారి సహాయకులు కూడా రావడంతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ జనాలతో కక్కిరిసిపోయింది. కొంత మంది రెండు రోజుల క్రితమే ఎగ్జిబిషన్ గ్రౌండ్ చేరుకున్నారు. ఇక్కడి వచ్చేవారి కోసం స్వచ్ఛంద సంస్థలు నీరు, ఆహారం అందిస్తున్నాయి. చేప మందు పంపిణీ సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 1500 మంది పోలీసులను ఇక్కడ మోహరించారు. కొవిడ్ కారణంగా గత మూడేళ్లుగా చేప మందు పంపిణీ చేయలేదు.
దీంతో ఈసారు జనాలు భారీగా వచ్చారు. అధికారులు దివ్యాంగులు, వృద్ధులు, మహిళల కోసం ప్రత్యేకంగా క్యూలైన్లు ఉ్ననాయి. చేప ప్రసాదం కోసం ఎంత మంది వచ్చినా ఇచ్చేందుకు తాము రెడీగా ఉన్నామని బత్తిన సాయినాథ్ గౌడ్ చెప్పారు. చేప ప్రసాదం కోసం వచ్చే వారికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్, జేబీఎస్, ఎంజీబీఎస్, ఈసీఐఎల్ ఎక్స్ రోడ్, శంషాబాద్ ఎయిర్‌పోర్టు వంటి ప్రాంతాల నుంచి దాదాపు 50 ప్రత్యేక బస్సులు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications