డికె అరుణ పార్టీ మారుతారా?: మాదే అసలైన టిడిపి: స్పీకర్‌కి రేవంత్
హైదరాబాద్: తాను పార్టీ మారుతున్నట్లుగా వస్తున్న వార్తలు అవాస్తవమని మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె అరుణ మంగళవారం నాడు అన్నారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను బెదిరించి తమ పార్టీలోకి తీసుకునే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. గద్వాల కోసం తాను ప్రాణత్యాగానికైనా సిద్ధమన్నారు.

సభాపతిని కలిసిన తెలంగాణ టిడిపి నేతలు
తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, గాంధీలు స్పీకర్ మదుసూధనా చారిని మంగళవారం కలిశారు. అసలైన తెలుగుదేశం పార్టీ తమదేనని ఆయనకు చెప్పారు. అలాగే, పార్టీ మారిన వారి పైన వెంటనే చర్యలు తీసుకోవాలని వారు కోరారు. చర్యలు తీసుకునే అంశంపై తమకు స్పష్టత ఇవ్వాలన్నారు.
ఇదిలా ఉండగా, రేపు (బుధవారం) తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు తమ పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడును విజయవాడలో కలవనున్నారు. తెలంగాణలో పార్టీ బలోపేతం, భవిష్యత్తు కార్యాచరణ పైన చర్చించనున్నారని తెలుస్తోంది.
తెరాస గూండాగిరి: షబ్బీర్ అలీ
టిఆర్ఎస్ నేతలు గూండాగిరి చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ మండిపడ్డారు. మజ్లిస్ పార్టీ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్ నేతల పైన దాడి చేస్తే... తమ పైన కేసు పెట్టడం విడ్డూరమన్నారు. తలారి సత్యం మృతి కేసులో న్యాయ విచారణ జరగాలన్నారు.












Click it and Unblock the Notifications