వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అభద్రతా భావం వద్దు.!ఆకాశమే మీ హద్దు.!దివ్యాంగులో మనోస్తైర్యం నింపిన మంత్రి కొప్పుల ఈశ్వర్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు వికలాంగులు అనే పదాన్ని నిషేధించారని, దివ్యాంగులు అని గౌరవంగా పిలవాలని దిశానిర్ధేశం చేసారని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, మైనారిటీ,దివ్యాంగుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం దివ్వాంగులను కంటికి రెప్పలా చూసుకుంటుందని, దివ్యాంగుల భద్రత, సంక్షేమం, అభ్యున్నతికోసం తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో పాటుపడుతుందన్నారు మంత్రి.

శుక్రవారం ప్రపంచ దివ్యాంగుల దినోత్పవం.. వికలాంగులలో స్పూర్తి నింపిన మంత్రి కొప్పుల ఈశ్వర్

శుక్రవారం ప్రపంచ దివ్యాంగుల దినోత్పవం.. వికలాంగులలో స్పూర్తి నింపిన మంత్రి కొప్పుల ఈశ్వర్

అంతే కాకుండా 500రూపాయల పింఛనునే 15 వందల రూపాయలకు పెంచి ప్రస్తుతానికి 3 వేల 16రైపాయలు అందిస్తున్నామని పేర్కొన్నారు. సుమారు 5లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామని, ఇందుకు ఏటా 18 వందల కోట్లు ఖర్చు అవుతుందని మంత్రి తెలిపారు. దివ్యాంగులను ఇతరులు పెళ్లి చేసుకుంటే లక్ష రూపాయలు ప్రోత్సాహాకం ఇస్తున్నామని, విదేశాలకు వెళ్లి చదువుకునే వాళ్లకు 20 లక్షలు ఉచితంగా అందజేస్తున్నామని అన్నారు. ఉద్యోగాలలో 2%రిజర్వేషన్లు ఇస్తున్నం. అభివృద్ధి, సంక్షేమ పథకాలలో రిజర్వేషన్లను 3% నుంచి 5% పెంచినట్టు, డబుల్ బెడ్ రూం ఇండ్లలో 5% కేటాయిస్తున్నట్టు మంత్రి తెలిపారు.

 దేశంలో ఏ రాష్ట్రం చేయని సంక్షేమ పథకాలు.. కేసీఆర్ చేసి చూపిస్తున్నారన్న మంత్రి

దేశంలో ఏ రాష్ట్రం చేయని సంక్షేమ పథకాలు.. కేసీఆర్ చేసి చూపిస్తున్నారన్న మంత్రి

అంధత్వం ఉన్న వాళ్లు ఉచిత కంప్యూటర్ శిక్షణతో పాటు ఉచిత ల్యాప్ టాప్స్ అందిస్తున్నామని, దివ్యాంగులకు కావలసిన ఉపకరణాలను అన్నింటినీ ఉచితంగా ఇస్తున్నామని మంత్రి స్పష్టం చేసారు. ఇటీవల 21కోట్లతో 14వేల దివ్యాంగులకు అందించామని, 90వేల విలువ చేసే టూవీలర్లను కూడా అందజేసామని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. స్మార్ట్ ఫోన్లు, వీల్ ఛైర్లు, ట్రైసైకిళ్లు అందించామని గుర్తు చేసారు. దివ్యాంగుల కోసం దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం లేదని, మానవ సేవనే మాధవసేవ అని మనసారా భావిస్తూ ప్రభుత్వం దివ్యాంగుల యోగక్షేమాలు చూసుకుంటోందని తెలిపారు.

 అభద్రతాభావం వద్దు.. అన్నింటా రాణించాలన్న మంత్రి ఈశ్వర్

అభద్రతాభావం వద్దు.. అన్నింటా రాణించాలన్న మంత్రి ఈశ్వర్

అంతే కాకుండా దివ్యాంగులు ఆత్మన్యూనతా భావాన్ని పూర్తిగా విడనాడి ఆత్మ స్థైర్యం, ఆత్మ విశ్వాసం, దృఢ సంకల్పంతో ముందుకు సాగాలని, ఆత్మ గౌరవాన్ని మరింత పెంపొందించుకుంటూ నిండూ నూరేళ్లు జీవించాలని మంత్రి దివ్యాంగులకు మనోధైర్యాన్ని నూరిపోసారు. అంతే కాకుండా తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సింహాచలం అనే అంధుడు ఐఏఎస్ సాధించాడని, శరీరం ఏ మాత్రం సహకరించకున్నా కూడా స్టీఫెన్ హాకింగ్ గొప్ప మేధావిగా కీర్తి గడించిండని దివ్వాంగుల్లో స్పూర్తి నింపారు మంత్రి కొప్పుల ఈశ్వర్.

 బంగారు పథకాలు పద్మశ్రీలు సాధించారు.. అకాశమే హద్దుగా చెలరేగిపోవాలన్న మంత్రి

బంగారు పథకాలు పద్మశ్రీలు సాధించారు.. అకాశమే హద్దుగా చెలరేగిపోవాలన్న మంత్రి

దీంతో పాటు ప్రమోద్ భగత్ పారా ఒలింపిక్స్ బాడ్మింటన్ లో బంగారు పతకం సాధించిండని, అంధుడైన బాలన్ పుతేరీ 2 వందల పుస్తకాలు రాసి ప్రముఖ రచయితాగా గుర్తింపు తెచ్చుకున్నాడని, పద్మశ్రీ అవార్డును కూడా అందుకున్నాడని గుర్తు చేసారు. దివ్యాంగులు కూడా సమాజంలో ఎదగాలని, ఎదుగుతారని ఆశిస్తున్నాని మంత్రి తెలిపారు. అనుకోకుండా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవాలని, అన్ని రంగాలలో రాణించాలని, ఉన్నతంగా ఎదగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్టు మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. శుక్రవారం వికలాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగులందరికీ శుభాకాంక్షలు తెలిపారు మంత్రి.

English summary
Minister Koppula Ishwar said that Chief Minister Chandrasekhar Rao had banned the term 'disabled' and directed them to respectfully call themselves 'Divyanga'.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X