కలలో కూడా తప్పు చేయను.!కన్నీళ్లకు పరిష్కారం చూపిస్తా.!తెలంగాణ ప్రజలకు ఈటల భరోసా.!
హైదరాబాద్ : పార్టీల జెండాల ఎజెండాల పంచాయితీ కాకుండా తెలంగాణ బానిసత్వంలోకి పోకుండా కాపాడుకోవాలని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరోసారి స్పష్టం చేసారు. సీఎం చంద్రశేఖర్ రావు ఈటల రాజేందర్ ను బయటికి పంపి తమకు ఓ అస్త్రం ఇచ్చారని, నాలుగు కోట్ల గొంతుక కావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని, తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేయనన్నారు ఈటల. తెలంగాణ ఉద్యమంలో ఎలా పని చేశామో ఇప్పుడు కూడా అలాగే పని చేస్తానని, చంద్రశేఖర్ రావు మోసాలను తిప్పికొట్టి నిఖార్సైన తెలంగాణ బిడ్డగా ఉంటానన్నారు ఈటల రాజేందర్.

కేసీఆర్ దురహంకారాన్ని ఓటుతో అణచి వేసారు.. రుణం తీర్చుకోలేనన్న ఈటల..
తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ముద్దు బిడ్డగా తెలంగాణ తల్లి విముక్తి కోసం పని చేయమని యావత్తు ప్రజలను ఒక్క తాటిమీదకు తెచ్చానని, ఈ రోజు మనందరి బాధ్యత చంద్రశేఖర్ రావు ప్రభుత్వం చేసే అరాచకాలు ఎండగట్టడమేనన్నారు ఈటల. దేవుని మొక్కు తీర్చుకోవడానికి కుల్కచర్ల, రామ లింగేశ్వర స్వామి చెంతకు వచ్చానని, ఈరోజు పార్టీలకు అతీతంగా ఈ కాలెండర్ ఆవిష్కరణ చేసుకొని నన్ను సన్మనించుకోవడనికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు ఈటల.

కేసీఆర్ దుర్మార్గాలకు తానే సాక్షినన్న ఈటల.. కేసీఆర్ ద్వంద్వ వైఖరి గల నాయకుడన్న ఈటల
అంతే కాకుండా సీఎం చంద్రశేఖర్ రావు దుర్మార్గానికి ప్రత్యక్ష సాక్ష్యం తానేనని, పదవుల కంటే ఆత్మగౌరవం గొప్పదని ఈటల మరోసారి స్పష్టం చేసారు. పదవిలో ఉన్నప్పుడు, లేనప్పుడు, ఎప్పుడూ కూడా ప్రజా సమస్యల మీద మాట్లాడకుండా ఉండలేకపోయానని మరోసారి స్పష్టం చేసారు. మున్సిపల్ కార్మికులను 1700 మందిని తీసివేసిన రోజున, మంత్రిగా ఉండి కూడా వారికి అండగా ఉండి సంఘీభావం చెప్పానని, మంత్రి పదవి కంటే కూడా వారి పక్షాన ఉండడం గొప్ప అనుభూతినిచ్చిందన్నారు ఈటల రాజేందర్.

పదవుల కంటే ఆత్మగౌరవం గొప్పది.. ఎమ్మెల్యే పదవిని కేసీఆర్ మొఖం మీద కొట్టానన్న ఈటల
ఆర్టీసీ సంఘాలు రద్దు చేసుకోవాలని సీఎం చంద్రశేఖర్ రావు అల్టిమేటం ఇచ్చి వారి చావులకు కారణం అయ్యారని, ఆనాడు వారి పక్షాన ఉన్నానని, కార్మిక సంఘాలు ఉంటాయని, ఉండి తీరుతాయని చెప్పింది తానేనని అన్నారు. ఇవన్నీ సీఎం చంద్రశేఖర్ రావుకు నచ్చలేదని అందుకే తనను మంత్రవర్గం నుండి నిర్ధాక్షిణ్యంగా తొలగించారని ఈటల గుర్తు చేసారు. పదవి అమ్మ నాన్న ఇచ్చింది కాదని, కొనుక్కుంటే వచ్చింది అంతకూ కాదని, ఇది ప్రజల బిక్ష అన్నారు ఈటల. తన తొలగింపుతో సీఎం చంద్రశేఖర్ రావు అహంకారంకు పాతర వేయాలని తెలంగాణ ప్రజలు అందరూ కంకణం కట్టుకున్నారన్నారు ఈటల రాజేందర్.

హుజురాబాద్ లో గెలుపుకోసం అనేక అడ్డదార్లు.. కేసీఆర్ ను పాతాళానికి తొక్కారన్న ఈటల రాజేందర్
ఎమ్మెల్యే పదవిని సీఎం చంద్రశేఖర్ రావు మొఖాన కొట్టి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళానని, 6 నెలలు కొట్లాడానని, ఎంతో మంది అండగా వచ్చారని, రాజేందర్ గెలుపు కోసం పని చేస్తాం అని పార్టీలకు అతీతంగా అనేక వర్గాలు ముందుకు వచ్చారని ఈటల గుర్తు చేసారు. వేలమంది వచ్చి ఎంతో తపన పడ్డారని, కళ్లలో ఒత్తులు వేసుకొని తన గెలుపుకోసం ఎదురు చూసారని, చివరకు హుజురాబాద్ లో సీఎం చంద్రశేఖర్ రావు దుర్మార్గాన్ని ఎండగట్టారని అన్నారు. ఓటు హక్కును కూడ పైసలతో కొనలాని, మద్యంతో మాయ చేయాలని చూసారని, సీఎం చంద్రశేఖర్ రావు 600 కోట్లు ఖర్చు పెట్టినా, 4500 కోట్ల జీఓ లు ఇచ్చినా. కోమరెల్లి మల్లన్న కంకణాలు తెచ్చి, పోచమ్మ గుళ్ళ మీద ప్రమాణాలు చేయించిన కూడ హుజూరాబాద్ ప్రజలు తెలంగాణ గర్వించే పద్దతిలో ప్రజాస్వామ్య బావుటా ఎగురవేశారన్నారు ఈటల రాజేందర్.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications