అసహజ శృంగారానికి బలవంతం: తెలంగాణ ఐఏఎస్‌పై భార్య ఫిర్యాదు, కోర్టు కీలక ఆదేశాలు

హైదరాబాద్: అసహజ శృంగానికి బలవంతం చేస్తున్నారంటూ తెలంగాణ ఐఏఎస్‌పై ఆయన భార్య ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. తెలంగాణ క్యాడర్‌కు చెందిన 2014 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ ఝాపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని పోలీసులకు ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

కట్నం కోసం తనను వేధిస్తున్నారంటూ ఆయన భార్య చేసిన ఆరోపణల నేపథ్యంలో కోర్టు ఈ మేరకు ఆదేశించింది. గృహహింసతో పాటు అసహజ శృంగారానికి బలవంతం చేస్తున్నారని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. కోర్బా ఎస్పీకి ఫిర్యాదు చేసినా.. ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. ఈ క్రమంలో ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఐఏఎస్‌పై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది.

domesticviolence

సందీప్ కుమార్ ఝా స్వస్థలం బీహార్‌లోని దర్బంగా జిల్లా. ఆయనకు 2021లో కోర్బా ప్రాంతానికి చెందిన యువతితో వివాహమైంది. రూ. కోటికిపైగా ఖర్చు చేసి పెళ్లి జరిపించినా.. పెద్ద ఎత్తున బంగారం, ఆభరణాలు తీసుకురావాలని సందీప్ కుమార్ డిమాండ్ చేశారని ఆయన భార్య ఆరోపించారు.

పెళ్లికి ముందు, తర్వాత కూడా కట్నం కోసం ఆయన తనను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారని ఆరోపించారు. తన భర్త బ్రాండెడ్ బట్టలు, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, టీవీ, ఫర్నీచర్ కూడా కట్నంగా తీసుకున్నాడని, దీని కోసం తన కుటుంబం వివాహానికి కోటి రూపాయలకు పైగా ఖర్చు చేయాల్సి వచ్చిందని ఆమె ఆరోపించారు. కాగా, సందీప్ కుమార్ ఝా ప్రస్తుతం తెలంగాణ ఐటీ శాఖలో జాయింట్ సెక్రటరీగా పని చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+