మీ ఓటు ఎవరికి పడిందో అనుమానం వద్దు.. ఇలా చెక్ చేసుకోండి!!

తెలంగాణ రాష్ట్రంలో పోలింగ్ మొదలైంది .119 అసెంబ్లీ నియోజకవర్గాలలో 3.26 కోట్లమంది నేడు 2290 మంది అభ్యర్థుల రాజకీయ భవిష్యత్తును ఓటర్లు ఈవీఎం బాక్సులలో భద్రపరచనున్నారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ ప్రారంభం కాగా మందకొడిగా ఓటర్లు ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు.

అయితే గతంలో బ్యాలెట్ బాక్సులు ఉన్నప్పుడు తమ ఓటు ఎవరికి వేశారో స్పష్టంగా తెలిసేది. కానీ ఇప్పుడు ఎలక్ట్రానికి ఓటింగ్ మెషీన్ లు వచ్చాక ఎవరికి ఓటు వేస్తున్నారో చాలా మందికి అర్ధం కావటం లేదు. అంతేకాదు తాము ఎవరికి ఓటేస్తే వారికి పడటం లేదని అనుమానాలు ఉన్న వారు కూడా ఉన్నారు.

Dont doubt who got your vote.. check this when you are voting!!

అయితే అలాంటి అనుమాన నివృత్తి కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఓటరు ఓటు వేసిన తర్వాత చూసుకునేలా ఒక వెసులుబాటు కల్పించింది. ఈ విషయం చాలా మందికి తెలియదు. పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు పెద్దపీట వేస్తున్న ఎన్నికల సంఘం ప్రజలకు జవాబుదారీగా నిలిచేందుకు పలు సంస్కరణలను ఓటింగ్ ప్రక్రియలో కొనసాగిస్తుంది.

అందులో భాగంగా ఓటర్లు తాను వేసిన ఓటు సంబంధిత అభ్యర్థికే పడిందా లేదా అని తెలుసుకునేందుకు వీలుగా ఈవీఎం లతోపాటు వివి ప్యాట్ ను ప్రవేశపెట్టింది. ఓటరు తాను ఓటు వేయగానే వివి ప్యాట్ లో చూసుకోవాలి. ఇది అభ్యర్థి క్రమ సంఖ్య, పేరు, గుర్తును ముద్రిస్తుంది. ఇది కేవలం 7 సెకండ్లు మాత్రమే మనకు కనిపిస్తుంది. తరువాత దానంతట అదే వీవీ ప్యాట్ బాక్స్ బాక్స్ లో పడిపోతుంది.

ఈ విధంగా ఓటేసిన తర్వాత ఓటర్లు తమ ఓటు ఎవరికి నమోదు అయిందో చెక్ చేసుకోవచ్చు. ఇలా చెక్ చేసుకోవటం ద్వారా ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా ఓటింగ్ సిస్టమ్ పై గౌరవం పెరుగుతుంది. కనుక ఇవ్వాళ ఓటేసే వారు తప్పకుండా మీ ఓటు నమోదును చెక్ చేసుకోండి. అనుమానాలతో ఓటింగ్ వ్యవస్థపై తప్పుడు అభిప్రాయాలను వ్యాప్తి చెయ్యకండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+