హైదరాబాద్ లో డూప్లెక్స్ హౌజ్.. జస్ట్ రూ. 80 లక్షలకే.. ఎక్కడో తెలుసా..?
హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ మార్కెట్ గణనీయంగా పుంజుకుంటోంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ అమెరికాను మించిపోయింది. అమెరికా కంటే హైదరాబాద్ లోనే ఇళ్ల ధరలు ఎక్కవ అని తేలుతోంది. అమెరికాను తలదన్నేలా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ పెరుగుతున్నట్లు పలు కథనాలు వెల్లడవుతున్నాయి. ఇక ఇటీవల హైదరాబాద్ నగర శివారులోని కోకాపేటలో జరిగిన వేలంలో ఎకరం భూమి ధర ఏకంగా రూ. 150 కోట్లకుపైగా పలికిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో హైదరాబాద్ లో సామాన్యుడు ఇంటిని కొనే అవకాశం లేకుండా పోయింది. వీరికి భాగ్యనగరంలో ఇల్లు అందని ద్రాక్షగానే ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇల్లు కొనుగోలు చేయడం చాలా కష్టంతో కూడుకున్నదిగా చెప్పొచ్చు. అయితే హైదరాబాద్ లోని ఓ ప్రాంతంలో మాత్రం తక్కువ ధరకే డూప్లెక్స్ ఇల్లు కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తున్నారు. కేవలం రూ. 80 లక్షలకే భాగ్యనగరంలో ఇల్లు కొనుగోలు చేసుకోవచ్చు. మరి ఆ ప్రాంతం ఎక్కడ ఉంది..?
మధ్యతరగతి ప్రజలకు సొంత ఇల్లు అనేది కల. ఎప్పటికైనా సొంత ఇల్లు కట్టుకోవాలని ప్రతి ఒక్కరూ భావిస్తుంటారు. అందుకోసం రూపాయి రూపాయి వెనకేసుకుంటారు. కానీ ప్రస్తుతం హైదరాబాద్ లాంటి మహానగరంలో ఇల్లు కొనుగోలు చేయాలంటే ఆషామాషీ కాదు. ప్రస్తుతం దేశంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న రంగంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పేరుగాంచింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఏకంగా అమెరికాను కూడా మించి పోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల కోకాపేటలో జరిగిన వేలంలో ఎకరం భూమి ధర రూ.151.25 కోట్లకు చేరింది.

అయితే ఈ క్రమంలోనే హైదరాబాద్ చుట్టుపక్కల ఔటర్ రింగ్ రోడ్డుకు మరింత ప్రాధాన్యం పెరిగింది. ఓఆర్ఆర్ చుట్టుపక్కల కూడా పెద్ద ఎత్తున కాలనీల కమర్షియల్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ల నిర్మాణం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే సాగర్ హైవే సమీపంలో పలు ప్రాంతాల్లో కేవలం రూ. 80 లక్షలకే డూప్లెక్స్ ఇండిపెండెంట్ హౌజ్ లభ్యం అవుతోంది. ఇతర ప్రాంతాలతో పోల్చితే ఇక్కడ భూముల ధరలు తక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం బ్రాహ్మణపల్లి, యంజాల్ ప్రాంతాల్లో ఈ తరహా ఇళ్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. వంద నుంచి 150 గజాల్లో ఈ ఇళ్లను నిర్మించి అమ్మకానికి సిద్ధంగా ఉంచినట్లు స్పష్టం అవుతోంది.












Click it and Unblock the Notifications