డ్రగ్స్.. డ్రగ్స్: అయ్యో.. వీళ్లకేమైంది? పూరీ వర్గాన్నే టార్గెట్ చేశారా?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: సినిమా ఇండ్రస్టీ అంటేనే ఓ మాయా జగత్తు. సింగిల్ నైట్లో స్టార్స్ అయిపోవచ్చు. సింగిల్ డేలో రోడ్డుపైకి వచ్చేయచ్చు. ఒక్క సినిమా హిట్ అయితే చాలు ఆ తర్వాత లైఫ్ మారిపోతుంది.

అప్పటి దాకా ఉండే సర్కిల్ మారిపోతుంది. లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోతుంది. కార్లు, ఫారెన్ ట్రిప్స్, లేట్ నైట్ పార్టీస్, మీటింగ్స్, షూటింగ్స్ ఇలా స్టార్ట్.. కెమెరా.. యాక్షన్.. చుట్టూ ఎన్నో కొత్తగా వచ్చి చేరిపోతాయి. వీటికి తోడు జనం ఎక్కడికి వెళ్లినా ఎగబడిపోతుంటారు. ఇలా ఒక్కసారిగా వచ్చిపడే స్టార్‌డమ్ కిక్ అంతా ఇంతా కాదు.

డ్ర‌గ్స్ రాకెట్ పై స్పందించిన న‌టీన‌టులు, ఎవరెవరు.. ఏమేం అన్నారంటే...

డ్రగ్స్ కేసు: 12 మంది సినీ ప్రముఖులు, అరెస్టు అంశంపై ఇప్పుడే చెప్పలేం: అకున్ సబర్వాల్

క్రాఫ్ చెదిరిపోకుండా, ముఖం వాడిపోకుండా పర్యవేక్షించే పది రకాల సిబ్బంది. కారు దిగితే స్టార్ హోటల్, విమానం ఎక్కితే విదేశాల్లో ల్యాండింగ్. వీటన్నింటికీ తోడు చుట్టూ పొగడ్తలతో ముంచెత్తే భజనపరులు. అంతేనా.. డబ్బుకు ఏ లోటు రాదు. ఇదీ సినిమా లైఫ్.

స్టార్ డైరెక్టరే...

స్టార్ డైరెక్టరే...

‘ఇడియట్' సినిమా తర్వాత దర్శకుడు పూరి జగన్నాథ్‌ను కూడా ఇండ్రస్టీ ‘ది డైరెక్టర్ ' అనేసింది. బద్రి, ఇడియట్, అమ్మనాన్న ఓ తమిళ అమ్మాయి, శివమణి, పోకిరి, బిజినెస్ మ్యాన్.. ఇలా చాలా హిట్స్‌తో ఉన్న పూరి స్టార్ డైరెక్టర్‌గా ఎదిగారు.

Tollywood drugs scandal : Tollywood Top Director, Heroes and 3 Heroines Names revealed
ఇప్పుడంటే హిట్స్ లేవుగానీ...

ఇప్పుడంటే హిట్స్ లేవుగానీ...

సమీప గతంలో హిట్స్ లేవుకానీ ఇప్పటికీ పూరి అంటే స్థిరపడిపోయిన బ్రాండ్ మాత్రం ఉంది. ఆయన చుట్టూ ఉన్న ఆ వలయం అలాగే ఉంది. తాజాగా డ్రగ్స్ కేసులో బయటికొచ్చిన పేర్లన్నీ పూరి కంపెనీలోని వారివి కావడం ప్రధానంగా గమనించాల్సిన అంశం.

ఒకప్పుడు బిజీ హీరోయిన్...

ఒకప్పుడు బిజీ హీరోయిన్...

డ్రగ్స్ కేసులో చార్మీ పేరు బయటకు రాగానే ‘అయ్యో.. ఈ పిల్లకు ఏమైంది?' అని అనుకోని వారుండరు. ఏమీ కాలేదు.. చేతిలో సినిమాలు లేవు అంతే. 13 ఏళ్లకే సినిమా ఇండ్రస్టీలోకి వచ్చిన చార్మీ చార్మింగ్ లుక్స్, అదిరిపోయే స్క్రీన్ ప్రజెంటేషన్స్‌తో పాటు మంచి నటి గానూ సొంత గుర్తింపు తెచ్చుకుంది. ఒకప్పుడు బిజీ స్టార్. సినిమాలకు తోడు షాప్స్ ఓపెనింగ్, మూవీ ఈవెంట్స్‌లోనూ బిజీగా ఉండే హీరోయిన్.

నటి - ఐటమ్ గర్ల్ - ప్రొడ్యూసర్...

నటి - ఐటమ్ గర్ల్ - ప్రొడ్యూసర్...

కథానాయిక ప్రాధాన్యత ఉన్న మంత్ర, అనుకోకుండా ఒకరోజు లాంటి సినిమాలతో ప్రతిభ చాటింది. హీరోయిన్‌గా అవకాశాలు తగ్గిపోయిన తర్వాత ఐటమ్ సాంగ్స్ కూడా చేసింది. జ్యోతిలక్ష్మి సినిమాతో ప్రొడ్యూసర్‌గా మారిన చార్మి ఆ మూవీలో టైటిల్ రోల్ తర్వాత పూర్తిగా తెరమరుగైంది. ప్రొడ్యూసర్‌గా కొత్త కెరీర్ ప్రారంభించిదనుకున్న సమయంలో డ్రగ్స్ కేసులో చార్మీ పేరు బయటికి రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Fans and Cine Lovers of Puri Jagannadh are thinking that what happened to them. Why their names came out in the Drugs case. What is the necessicity to take drugs. People not believing that Heroine Charmi also taking drugs. Some others are suspecting that.. are they targeted?
Please Wait while comments are loading...