తాగి కారు నడుపుతూ యువతుల హల్‌చల్: పోలీసులు చెక్ పెట్టారు

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 45లో అర్ధరాత్రి మద్యం తాగి నడుపుతూ వచ్చిన ఇద్దరు యువతులు హల్‌చల్‌ చేశారు. బ్రీత్ ఎనలైజర్ టెస్టుకు ససేమిరా అంటూ మొండికేశారు.

పోలీసులు ఎంత కోరినా.. వాళ్లు అంగీకరించకపోవడం కాసేపు గందరగోళం నెలకొంది.
పోలీసులు వారిని ఒప్పించి చివరకు వారికి బ్రీత్ అనలైజర్ టెస్ట్ నిర్వహించారు. ఒకరు 97 బీఏసీ మద్యం తాగినట్లు తేలింది. మరో యువతీ అదే స్థాయిలో మద్యం తాగినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో వారి కార్లను సీజ్‌ చేశారు.

ఈ తనిఖీల్లో మొత్తం 14 కేసులు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న వాహనాల్లో ఎక్కువగా కార్లే ఉన్నాయి. తల్లిదండ్రులను తీసుకొని సోమవారం కౌన్సెలింగ్‌కు రావాలని నిందితులకు సూచించారు.

Drunken Drive Girls Hulchul in Hyderabad

బైక్ రేసింగ్: యువకుల అరెస్ట్

హైదరాబాద్ నగరంలో అర్ధరాత్రిళ్లు యువకులు బైక్ రేసింగ్‌కి పాల్పడుతున్న ఘటనలు ఇటీవల కాలంలో తరచూ చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో బైక్ రేసింగ్‌కు పాల్పడుతున్న కొందరు యువకులను శనివారం రాత్రి ట్రాఫిక్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

స్టాపర్ల సాయంతో అడ్డుకొని వీరిని పట్టుకున్నారు. పశ్చిమ మండలంలో ఏకకాలంలో శనివారం రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌, తనిఖీలు చేపట్టారు. మొత్తం 77 కేసులను నమోదు చేసినట్లు పంజాగుట్ట డివిజన్‌ ఏసీపీ కోటేశ్వర్‌రావు తెలిపారు.

పంజాగుట్ట, బేగంపేట, ఎస్సార్‌నగర్‌, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఏకకాలంలో తనిఖీలను చేపట్టారు. 27 కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రేసింగ్‌ వాహనాలకు సంబంధించి ఏర్పాటు చేసిన ప్రత్యేక డ్రైవ్‌లో పాల్గొన్న పోలీసులకు రేసర్లు చుక్కలు చూపారు. పోలీసులకు చిక్కకుండా, వాహనాల్ని నిలపకుండా వేగంగా పోనిస్తూ కవ్వించే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు ఇటు కేబీఆర్‌ ఉద్యానవన కూడలితోపాటు అటు జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు కూడలిలో స్టాపర్లు ఏర్పాటు చేశారు.

మొత్తం ఎరుపు రంగు సిగ్నల్స్‌ వేసి రేసింగ్‌ వాహనాలను పట్టుకున్నారు. దఫదఫాలుగా మొత్తం 9 స్పోర్ట్స్‌ బైకులను, ఒక ఆడీ కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితులకు కౌన్సెలింగ్‌ నిర్వహించాక వాహనాలను అప్పగిస్తామని ఏసీపీ తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Drunken Drive Girls Hulchul in Hyderabad on Sunday night.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి