డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికి గుండెపోటంటూ కుప్పకూలాడు: అసలేం జరిగిందంటే..?

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడుతున్న యువకులు, వ్యక్తులు పోలీసులకు తరచూ షాక్‌లిస్తున్నారు. తాజాగా ఓ తాగుబోతు 'గుండెపోటు' అంటూ పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించిన ఘట నగరంలోని ఎల్పీనగర్‌లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. సోమవారం అర్ధరాత్రి ఎల్పీనగర్ పోలీసులు రోజువారిలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు. ఈ సందర్భంగా ఆ దారిలో వెళ్తున్న వాహన చోదకులను తనిఖీలు చేస్తున్నారు.

Drunken Man Hulchul At Police Drunk & Drive Test In LB Nagar

ఈ క్రమంలో అటుగా వచ్చిన ఓ వ్యక్తిని తనిఖీ చేస్తుండగా.. బ్రీత్ అనలైజర్ టెస్టుకు నిరాకరించాడు. ఆ తర్వాత అతను గుండె పట్టుకుని అక్కడే కుప్పకూలిపోయాడు.దీంతో కొంత ఆందోళనకు గురైన పోలీసులు.. వెంటనే అతడ్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

అయితే, ఆయనకు చికిత్స అందించిన వైద్యులు.. అతనికి గుండె నొప్పి ఏమీ రాలేదని, అదంతా దొంగ నాటకమని తేల్చి చెప్పారు. దీంతో ఆ తాగుబోతును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A Drunken Man Hulchul at Police Drunk & Drive test in LB Nagar in Hyderbad on Monday night.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి