Dubbaka bypoll results:తెలంగాణాలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే,బీజేపీ నేత మురళీధర్ రావు ట్వీట్
తెలంగాణ రాష్ట్రంలోని దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆసక్తిని రేకెత్తిస్తోంది . ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని తెగ కష్టపడిన బీజేపీ ఇప్పటివరకు ఆధిక్యంలో ఉంది. అయితే 10 రౌండ్ల తర్వాత నుండి బాగా పుంజుకున్న టీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం 21 రౌండ్లు ముగిసినా హోరాహోరీగానే పోరాటం చేస్తుంది. ప్రస్తుతం రెండు పార్టీల ఓట్ల మధ్య వ్యత్యాసం వందల సంఖ్యలోనే ఉంది .
Recommended Video
తాజా దుబ్బాక ఉపఎన్నిక కౌంటింగ్ కొనసాగుతున్న సమయంలో బీజేపీ నేత మురళీధర్ రావు ఆసక్తికర ట్వీట్ చేశారు. ప్రస్తుతం దుబ్బాకలో బీజేపీ పర్ఫామెన్స్ చూస్తే , తలపడుతున్న తీరు చూస్తే తెలంగాణా రాష్ట్రంలో టీఆర్ ఎస్ పార్టీకి నిజమైన ఆల్టర్నేటివ్ బీజేపీ నే అని అనిపిస్తుంది అంటూ ట్వీట్ చేశారు . నిన్నా మొన్నటి వరకు కాంగ్రెస్ కూడా టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా తామే ఉన్నామని చెప్పుకున్న సందర్భంలో దుబ్బాకలో కాంగ్రెస్ పోటీ కూడా గట్టిగా ఇవ్వలేకపోయింది. ఈ నేపధ్యంలో మురళీధర్ రావు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

ఒకప్పటి పరిస్థితితో పోల్చుకుంటే ఇప్పుడు బీజేపీ మెరుగ్గానే ఎన్నికలలో తలపడుతుంది . ఇక దుబ్బాకలో ప్రస్తుతానికి బీజేపీ వందలలోనే ఓట్ల ఆధిక్యంలో ఉండగా ఇంకా కౌంటింగ్ కొనసాగుతుంది. చివరి ఫలితం వెలువడే వరకు ఉత్కంఠ కొనసాగే అవకాశం ఉంది . ఏది ఏమైనా బీజేపీ టీఆర్ఎస్ పార్టీకి గట్టిగానే పోటీ ఇస్తూ తలపడుతున్న సమయంలో బీజేపీ నేత మురళీధర్ రావు ట్వీట్ పార్టీ శ్రేణులకు బూస్టింగ్ ఇచ్చినట్లు అయింది. అంతకు ముందే బీజేపీ నేత రాం మాధవ్ కూడా దుబ్బాక ఉప ఎన్నికపై ఆసక్తికర ట్వీట్ చేశారు . దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో బిజెపి, టిఆర్ఎస్ మధ్య తెలంగాణలో ఒక ఆసక్తికరమైన పోరాటం సాగుతుందని , ప్రస్తుతం బిజెపి ముందుంది అంటూ వ్యాఖ్యానించారు . ఇది బిజెపికి ఆశ్చర్యం కలిగించే విజయం అంటూ పేర్కొన్న ఆయన తెలంగాణలో బీజేపీ బాగానే పుంజుకుంది అన్న సంతోషం వ్యక్తం చేశారు .
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications