Red chillies: మిర్చికి డిమాండ్.. భారీగా పెరిగిన ధరలు..
ఈ సంవత్సరం కూడా మిర్చి ధర భారీగా పలుకుతోంది. అంతర్జాతీయంగా మిర్చికి భారీగా డిమాండ్ ఉండడంతో మిర్చి ధరలు భారీగా పెరిగాయి. మిర్చికి సంబంధించి మొదటి కోత మిర్చి వ్యవసాయ మార్కెట్లకు రావడం ప్రారంభమైంది. వరంగల్, ఖమ్మం, మలక్ పేట్ మార్కెట్ కు వచ్చే మిర్చి వస్తుంది. ఈ మార్కెట్లలో మిర్చి రేటు భారీగా పలుకుతోంది.
వండర్ హాట్ రకం మిర్చి క్వింటాల్ కు భారీగా పలుకుతోంది. ఈ రకం మిర్చి క్వింటా రూ.24 వేల నుంచి రూ.28 వేల వరకు ఉన్నట్లు మార్కెట్ అధికారులు చెబుతున్నారు. శుక్రవారం వరంగల్ ఏనుమాముల మార్కెట్ కు 127 క్వింటాళ్ల వండర్ హట్ మిర్చి వచ్చింది. తాలు రకం మిర్చికి కూడా భారీగాగ డిమాండ్ ఉంది. శుక్రవారం ఖమ్మం మార్కెట్‌లో తాలు మిర్చి క్వింటాల్ అత్యధికంగా రూ.9 వేల నుంచి రూ.15,000 వరకు విక్రయించారు.

డిసెంబర్ 28న ఖమ్మం మార్కెట్‌లో తాలు రకం మిర్చికి గరిష్టంగా రూ.15,500 ధర పలికినట్లు అధికారులు తెలిపారు. ఈయేడు ఇదే అత్యధికం. తాజా పరిస్థితుల నేపథ్యంలో మిర్చి ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. శుక్రవారం మలక్‌పేట్ లోని మహబూబ్ మాన్షన్ మార్కెట్‌కు నంబర్ వన్ రకం మిర్చి 923 క్వింటాళ్లు వచ్చినట్లు పేర్కొన్నారు.
క్వింటాల్ గరిష్టంగా రూ.22వేలు, కనిష్టంగా రూ.14వేలు, మోడల్ రూ.15వేల చొప్పున విక్రయిస్తున్నారు. సోమవారం మాత్రం కేవలం 85 క్వింటాళ్లు రాగా, రూ.18వేలు పలికింది. నంబర్ 2 రకం శుక్రవారం 967 క్వింటాళ్లు, శనివారం 886 క్వింటాళ్లు మార్కెట్‌కు రాగా, గరిష్టంగా రూ.13వేలకు అమ్ముడయింది. తేజ రకం మిర్చి ఖమ్మం మార్కెట్‌లో శుక్రవారం 1,710 క్వింటాళ్ల మిర్చి వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications