సంక్రాంతికి తెలంగాణా ఆర్టీసీ రికార్డ్ ఆదాయం.. 5రోజుల్లోనే అన్ని కోట్లా!
సంక్రాంతి పండుగ సీజన్‌లో లక్షల సంఖ్యలో ప్రజలు తమ స్వగ్రామాలకు చేరుకొని పండుగ చేసుకుంటారు. ప్రతీ సంక్రాంతికి ఇదే తరహాలో ముఖ్యంగా హైదరాబాద్ నుండి ఏపీకి భారీ సంఖ్యలో ప్రజలు తరలి వెళ్తారు. ఇక వీరందరి రవాణా కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి మరీ ప్రయాణికులకు సౌకర్యాలను కలిగిస్తుంది. ఇక ప్రత్యేక బస్సులకు అదనపు చార్జీలను సైతం వసూలు చేస్తుంది.
సంక్రాంతి సీజన్ లో కోట్లు ఆర్జించిన తెలంగాణా ఆర్టీసీ
ఈ ఏడాది సంక్రాంతి సీజన్ లో తెలంగాణా ఆర్టీసీ కోట్ల రూపాయలను ఆర్జించింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కేవలం 5 రోజుల్లోనే భారీ ఆదాయం ఆర్జించింది. ఈసారి పండుగ సెలవులకు డబుల్ వీకెండ్ తోడవడంతో, హైదరాబాద్ నుంచి స్వగ్రామాలకు రికార్డు స్థాయిలో ఉద్యోగులు, విద్యార్థులు, ఉపాధి కోసం వచ్చిన వారు ఏపీకి , తెలంగాణా లోని తమ స్వగ్రామాలకు పయనమయ్యారు.

జనవరి 9 నుంచి 13 వరకు ఐదు రోజుల్లో 67కోట్ల నలభై లక్షల ఆదాయం
ప్రయాణికుల రద్దీని ముందే అంచనా వేసిన ఆర్టీసీ యాజమాన్యం పక్కా ప్రణాళికతో వ్యవహరించి విజయవంతమైంది. జనవరి 9 నుంచి 13 వరకు ఐదు రోజుల్లో ప్రయాణ టిక్కెట్ల అమ్మకాల ద్వారా ఆర్టీసీకి ఏకంగా రూ. 67.40 కోట్ల ఆదాయం లభించింది. సగటున రోజుకు రూ. 13.48 కోట్ల రాబడి నమోదైంది. ఇది సాధారణ రోజుల ఆదాయం కంటే చాలా ఎక్కువ.
పండుగ ప్రయాణాల కోసం ఆర్టీసీ భారీ ఏర్పాట్లు
పండుగ రద్దీని తట్టుకునేందుకు నడిపిన 6,431 ప్రత్యేక బస్సుల కారణంగా రోజుకు అదనంగా రూ.2.70 కోట్ల ఆదాయం సమకూరింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులలో ధరలు ఎక్కువగా ఉండటంతో చాలామంది సురక్షిత ప్రయాణం కోసం ఆర్టీసీనే ఆశ్రయించడంతో సంస్థకు కలిసొచ్చింది. పండుగ అనంతరం ప్రజలు తిరిగి హైదరాబాద్‌కు చేరేందుకు ఆర్టీసీ భారీ ఏర్పాట్లు చేసింది.
ప్రతీ ఏడాది ఆర్టీసీ పాలిత కల్ప వృక్షంగా సంక్రాంతి
నేడు, రేపు సైతం ప్రత్యేక బస్సులు వివిధ ప్రాంతాల నుండి ప్రయాణికులను అదే స్థాయిలో చేరవేస్తాయి. ఏపీ, తెలంగాణల నుంచి హైదరాబాద్‌కు వచ్చే వారికి జంక్షన్ల వద్ద పర్యవేక్షణ బృందాలు సమాచారం అందిస్తున్నాయి. ఇక సంక్రాంతి పండుగ ప్రతీ ఏడాది ఆర్టీసీ పాలిత కల్ప వృక్షంగా మారుతుంది. ఆర్థిక కష్టాల్లో ఉన్న ఆర్టీసీకి ఈ పండుగ లాభాలు పెద్ద ఊరటనిచ్చాయి.
సంక్రాంతి జోష్ తో మేడారం జాతరకు ఆర్టీసీ రెడీ
మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఉచిత ప్రయాణం ఉన్నప్పటికీ, జీరో టికెట్ల రీయింబర్స్‌మెంట్ తోనూ ప్రభుత్వం ఆర్టీసీని ఆదుకుంటుంది. పండుగ రద్దీతో పెరిగిన ప్రయాణాలు, వాటి ద్వారా వచ్చిన ఆదాయం సంస్థకు ఆర్థిక బలాన్ని చేకూరుస్తుంది. ఈ జోష్‌తో భవిష్యత్తులో మరిన్ని పండుగలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెచ్చి వీలైనంత ఆదాయం సంపాదించాలని ఆర్టీసీ భావిస్తోంది. ఇక త్వరలో మేడారం జాతర కూడా ఉండటంతో ఆర్టీసీ రెడీ అవుతోంది. .
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications