దసరా సమయంలో తెలంగాణాకు ఎగిరి గంతేసే వార్త చెప్పిన కేంద్రం!

దేశాన్ని సర్వతోముఖాభివృద్ధి చేసే దిశగా కేంద్రం ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా కేంద్రం విద్యారంగం పైన కూడా ప్రధానంగా ఫోకస్ చేస్తుంది. ఈ క్రమంలో తాజాగా దేశవ్యాప్తంగా కొత్తగా 57 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది కేంద్ర ప్రభుత్వం. కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుతో తెలంగాణ రాష్ట్రానికి కూడా శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్రానికి నాలుగు నూతన కేంద్రీయ విద్యాలయాలు మంజూరు చేసింది .

మారుమూల ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన విద్య
ఇదే విషయాన్ని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తెలంగాణలో విద్యాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం గత 11 సంవత్సరాలుగా సహకారాన్ని అందిస్తోందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. మారుమూల ప్రాంతాలలో కూడా విద్యార్థులకు ప్రాథమిక, మాధ్యమిక నాణ్యమైన విద్యను అందించడానికి నూతన విద్యాలయాలు కీలకపాత్ర పోషిస్తాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

dussehra time center said good news to telangana with 4 kendriya vidyalayas

Take a Poll

తెలంగాణాకు కొత్తగా నాలుగు కేంద్రీయ విద్యాలయాలు మంజూరు
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 35 కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయని ఇప్పుడు మరో నాలుగు అదనంగా చేరాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన ఆకాంక్ష జిల్లాలోనూ, ములుగు జిల్లా కేంద్రమైన గిరిజన ప్రాంతంలోనూ, జగిత్యాల జిల్లాలోని జగిత్యాల రూరల్ మండలంలోని చల్గల్ లోను, వనపర్తి జిల్లా నాగవరం శివారులోనూ ఈ నాలుగు కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేయనున్నారు.

మోడీకి, కేంద్ర విద్యా శాఖామంత్రికి ధన్యవాదాలు చెప్పిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
మారుమూల ప్రాంతాలలో కూడా విద్యాలయాల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి మరో నాలుగు కేంద్రీయ విద్యాలయాలను అందించిన భారత ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

నాణ్యమైన సెకండరీ విద్యను అందించడం కోసం పీఎం శ్రీ పాఠశాలలు
కేంద్రీయ విద్యాలయాలను ఇవ్వడం మాత్రమే కాదు గత రెండేళ్ల కాలంలో తెలంగాణలో నాణ్యమైన సెకండరీ విద్యను అందించడం కోసం పీఎం శ్రీ పాఠశాలలను ఏర్పాటు చేసినట్లుగా కూడా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం మొత్తం 400 కోట్ల రూపాయలతో 832 పీఎం శ్రీ పాఠశాలలను మంజూరు చేసిందని, దేశవ్యాప్తంగా పీఎం శ్రీ పాఠశాలల కోసం అత్యధిక కేటాయింపులు పొందిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నిలిచిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

కేంద్రం తెలంగాణా విద్యాభివృద్ధికి చేసింది చెప్పిన కేంద్రమంత్రి
ఇక సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా గత రెండేళ్లలో కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి సుమారు రెండువేల కోట్ల రూపాయలను కేటాయించిందని, దాదాపు వెయ్యి కోట్ల వ్యయంతో ములుగు జిల్లాలో సమ్మక్క సారలమ్మ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేసిందని కిషన్ రెడ్డి గుర్తు చేశారు తెలంగాణ రాష్ట్రంలో విద్యా పురోగతికి కేంద్రం పూర్తిస్థాయిలో సహకారం అందిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+