అప్పుల తిప్పలు, ఆదాయం ఇలా - ఇదీ అసలు లెక్క..!!
Telangana Budget 2025: 2025-26 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను డిప్యూటీ సీఎం భట్టి అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. 3,04,965 కోట్లతో బడ్జెట్ ప్రతిపాదనలను సమర్పిం చా రు. దీర్ఘకాలిక ప్రయోజనాలను పరిగణలోకి తీసుకొని పని చేస్తున్నామని చెప్పారు. ఈ బడ్జెట్ లో భట్టి రెవెన్యూ వ్యయం - రూ.2,26,982 కోట్లుగా పేర్కొన్నారు. మూలధన వ్యయం - రూ.36, 504 కోట్లు గా పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఆర్దిక పరిస్థితులను భట్టి వివరించారు. 2025-26 ఆర్దిక సంవత్సరంలో అప్పులు - ఆదాయ అంచనాలను వెల్లడించారు.
అప్పుల లెక్కలు
భట్టి తన బడ్జెట్ ప్రసంగం వేళ 2024 -2023 వరకు రాష్ట్రంలో ఆర్దిక నిర్వహణ.. అప్పుల పైన బడ్జెట్ లో ప్రత్యేకంగా ప్రస్తావన చేసారు. గాడి తప్పిన వ్యవస్థలను సక్రమార్గంలో పెడుతున్నామని చెప్పుకొచ్చారు. సంక్షేమంతో పాటుగా తెలంగాణ సుస్థిర అభివృద్ధి కోసం పనిచేస్తున్నామని చెప్పా రు. ప్రతి పౌరుడికి మెరుగైన వైద్యం కోసం చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కాగా, రాష్ట్ర అప్పుల లెక్కలను వివరించారు. ఈ ఆర్థిక ఏడాది ముగిసే నాటికి అప్పుల అంచనా రూ.5,04, 814 కోట్లుగా పేర్కొన్నారు. ఇక.. రాష్ట్ర సొంత పన్నుల రాబడి అంచనా రూ.1,45,419 కోట్లు గా అంచనా వేసారు. బడ్జెట్‌లో రుణాలు రూ.69,639 కోట్లుగా ప్రతిపాదించారు.

ఆదాయం పై ఆశలు
2025-26 సంవత్సరానికి తెలంగాణ కు కేంద్ర పన్నుల్లో వాటా రూ.29,899 కోట్లు వస్తుందని అంచనా వేస్తున్నారు. పన్నేతర ఆదాయం అంచనా రూ.31,618 కోట్లుగా లెక్క చూపించారు. ఇదే సమయంలో.. కేంద్రం నుంచి గ్రాంట్ల అంచనా రూ.22,782 కోట్లు వస్తాయని భావిస్తున్నారు.
ఈ ఆర్థిక ఏడాది ముగిసే నాటికి అప్పుల అంచనా రూ.5,04,814 కోట్లుగా పేర్కొన్నారు. జీఎస్డీపీలో అప్పుల శాతం 28.1గా అంచనా గా చెప్పుకొచ్చారు. రాష్ట్రానికి రెవిన్యూ తెచ్చే శాఖలుగా పేర్కొనే
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం అంచనా రూ.19,087 కోట్లు కాగా, ఎక్సైజ్ శాఖ ఆదాయం అంచనా రూ.27,623 కోట్లు వస్తుందని లెక్క కట్టారు.
Watch live: Deputy CM Bhatti Vikramarka Mallu presenting the 2025-26 budget in the Telangana Assembly. https://t.co/bePG8ayL68
— Bhatti Vikramarka Mallu (@Bhatti_Mallu) March 19, 2025
సమర్థతకు సవాల్
ఇక, అమ్మకం పన్ను ఆదాయం అంచనా రూ.37,463 కోట్లు.. వాహనాలపై పన్ను ఆదాయం అంచనా రూ.8,535 కోట్లు గా అంచనాగా వెల్లడించారు. తెలంగాణ రైజింగ్ 2050 ప్రణాళికతో పాలన సాగిస్తున్నామని తెలంగాణ రైజింగ్ 2050 ప్రణాళికతో పాలన సాగిస్తున్నామని భట్టి తన బడ్జెట్ ప్రసంగంలో వివరించారు. హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు మాస్టర్ ప్లాన్ తయారీ చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణను అగ్రగామిగా నిలిపేందుకు మెగా మాస్టర్‌ప్లాన్ 2050 రూపొందించామని వెల్లడించారు. హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు మాస్టర్ ప్లాన్ తయారీ చేస్తున్నట్లు భట్టి ప్రకటించారు. తెలంగాణను అగ్రగామిగా నిలిపేందుకు మెగా మాస్టర్‌ప్లాన్ 2050 రూపొందించామని చెప్పారు. తాజా అంచనాలతో రాష్ట్ర ఆర్దిక నిర్వహణ ఇప్పుడు ప్రభుత్వ సమర్థతకు సవాల్ గా నిలుస్తోంది.












Click it and Unblock the Notifications