Earth quake: మళ్ళీ భూకంపం.. షాకింగ్ విషయం చెప్పిన ఎన్జిఆర్ఐ శాస్త్రవేత్త!
తెలుగు రాష్ట్రాలలో ఈరోజు ఉదయం భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. నేడు ఉదయం ఏడు గంటల 27 నిమిషాలకు కొన్ని సెకండ్ల పాటు చోటు చేసుకున్న భూకంపంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇల్లు, అపార్ట్మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇక తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా మేడారంలో భూకంప కేంద్రం ఏర్పడినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.
భూకంపంపై అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్తలు
దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.3గా నమోదయిందని తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్లోని సిఎస్ఐఆర్ ఎన్జిఆర్ఐ శాస్త్రవేత్తలు తాజా భూకంపం పైన అధ్యయనం చేస్తున్నారు. భూకంప కేంద్రాల నుంచి 225 కిలోమీటర్ల పరిధిలో ఈ ప్రకంపనల ప్రభావం కనిపించినట్టు వారు తెలిపారు.

మళ్ళీ భూకంపం వచ్చే అవకాశం
అయితే ఇదే క్రమంలో మరో షాకింగ్ విషయాన్ని కూడా చెప్పారు ఎన్ జి ఆర్ ఐ శాస్త్రవేత్త డాక్టర్ శేఖర్. తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని వారాలలో మరోమారు భూప్రకంపనలు చోటుచేసుకునే అవకాశం ఉందని ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్త డాక్టర్ శేఖర్ అంచనా వేశారు. అయితే ప్రస్తుతం తో పోలిస్తే తక్కువ తీవ్రతతో ఈ ప్రకంపనలు ఉంటాయని ఆయన తెలిపారు.
ఆందోళన అవసరం లేదని చెప్తూనే
పాత భవనాలు, పగుళ్లు గల నిర్మాణాలను ఖాళీ చేయడం మంచిదని ఆయన ఈ మేరకు సూచించారు. అయితే మరోమారు భూకంపం వచ్చినప్పటికీ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. గతంలో 1969 వ సంవత్సరంలో భద్రాచలంలో అత్యధికంగా 5.7 తీవ్రతతో భూకంపం వచ్చిందని ఆయన పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాలు భూకంపం విషయంలో డేంజర్ జోన్ లో లేవన్నారు.
ఆరు కంటే తీవ్రత అవకాశం లేదు
రిక్టర్ స్కేల్ పై 6 లోపు ఎలాంటి ప్రమాదాలు జరగవని, మన దగ్గర ఆరు కంటే ఎక్కువ తీవ్రతతో భూకంపం వస్తుందన్న ఆందోళన అవసరం లేదని అన్నారు. మన దగ్గర భూకంపం కారణంగా ఎటువంటి ముప్పు లేదని ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్త డాక్టర్ శేఖర్ వెల్లడించారు.
ప్రజలలో భూకంపంపై చర్చ
మరోవైపు తాజా భూకంపం నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇక తాజా భూకంపం నేపథ్యంలో ప్రజలలో భూకంపం పైన తీవ్ర చర్చ జరుగుతున్న వేళ మరోమారు భూకంపం వస్తుందని అయితే ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.












Click it and Unblock the Notifications