కేటీఆర్‌పై ఎన్నికల కమిషన్ సీరియస్..నోటీసులు- డెడ్‌లైన్: ఆ స్టేట్‌మెంట్‌తో చిక్కులు
హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు గడువు సమీపిస్తోన్న కొద్దీ ప్రచార జోరు పెరుగుతోంది. అన్ని ప్రధాన పార్టీలు జనంలోకి వెళ్లాయి. ఇంటింటినీ పలకరిస్తోన్నాయి. రోడ్ షోలు, బహిరంగ సభలతో హోరెత్తిస్తోన్నాయి. ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంది.
తెలంగాణలో ఈ నెల 30వ తేదీన పోలింగ్ నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల కమిషన్. ఒకే విడతలో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరంలల్లో అదే రోజు ఓట్లను లెక్కిస్తారు. ఇప్పటికే రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరంలో పోలింగ్ ముగిసింది.

ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్.. చిక్కుల్లో పడ్డారు. కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు ఆయనకు నోటీసులను పంపించారు. నోటిఫికేషన్ వెలువడిన తరువాత ఆయన చేసిన ఓ ప్రకటనను ఈసీ పరిగణనలోకి తీసుకుంది. దీన్ని ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనగా భావించింది.
దీనిపై నోటీసులను జారీ చేసింది. ఈ నోటీసులకు సమాధానం ఇవ్వడానికి డెడ్ లైన్ కూడా విధించింది. ఈ మధ్యాహ్నం 3 గంటల్లోగా సంతృప్తికరమైన వివరణ ఇవ్వాలని ఆదేశించింది కేంద్రం ఎన్నికల కమిషన్. పోలింగ్ గడువు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో కేటీఆర్‌కు ఈసీ నోటీసులు అందడం కలకలం రేపింది.
ఇటీవలే కేటీఆర్ టీ- హబ్‌లో నిరుద్యోగులతో సమావేశమైన విషయం తెలిసిందే. అప్పట్లో ఆయన ఉద్యోగాల కల్పనపై ఓ ప్రకటన చేశారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గతంలో విడుదల నోటిఫికేషన్లపైనా స్పందించారు. టీ- హబ్‌లో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు, ప్రకటనలపై కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా.. ఈసీకి ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications