కొత్త పథకాలు వద్దు, నాటి నుంచే తెలంగాణలో అమల్లోకి ఎన్నికల ప్రవర్తనా నియమావళి: ఈసీ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అసెంబ్లీ రద్దయిన నాటి నుంచే ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని స్పష్టం చేసింది.
కొత్త అసెంబ్లీ ఏర్పడే వరకు కూడా ఎన్నికల నియమావళి అమల్లో ఉంటుందని పేర్కొంది. అంతేగాక, ఆపద్ధర్మ ప్రభుత్వం ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదని ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది.
కొత్త పథకాలను కూడా ప్రకటించకూడదని ఆపద్ధర్మ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఎన్నికల ప్రచారాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు.. అధికారులను, అధికారిక వనరులను ఉపయోగించుకోకూడదని తెలిపింది.

రాష్ట్రంలో పరిపాలనకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతోనే ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఓ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ ఈ ప్రకటన వెలువరించింది.
సాధారణంగా ఎన్నికలు జరిగితే షెడ్యూల్ విడుదల చేసినప్పటి నుంచి కోడ్ అమల్లోకి వస్తుంది కానీ, ప్రభుత్వమే అసెంబ్లీ రద్దు చేసిన నేపథ్యంలో ఆరోజు నుంచే నియమావళి అమల్లోకి వచ్చింది.












Click it and Unblock the Notifications