కవిత కేసులో షాకింగ్ ట్విస్ట్.. కేసీఆర్ అల్లుడికి నోటీసులు
Kalvakuntla Kavitha: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన భారత్ రాష్ట్ర సమితి శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత మరింత చిక్కుల్లో పడ్డారు. ఈ కేసుపై విచారణ జరుపుతోన్న ఢిల్లీలోని రోస్ అవెన్యూ న్యాయస్థానం సంచలన ఆదేశాలను జారీ చేసింది.
కోర్టు ఆదేశాలతో..
కవితకు రిమాండ్ విధించింది. ఆమెను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల కస్టడీకి తరలించింది. ఈ నెల 23వ తేదీ వరకు ఈడీ అధికారుల కస్టడీలో ఉండాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ఈడీ అధికారులు ఆమెను కస్టడీలోకి తీసుకున్నారు. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో మరింత లోతుగా విచారణ చేపట్టనున్నారు.

10 రోజులు కోరినా..
అనంతరం ఆమెను ఢిల్లీకి తరలించారు. ఈ మధ్యాహ్నం రోస్ అవెన్యూ న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. కవితను విచారించడానికి 10 రోజుల కస్టడీ కావాలని ఈడీ అధికారులు.. న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ చోటు చేసుకుందని, దీనిపై లోతుగా విచారణ చేపట్టాల్సి ఉందని కోరారు.
భర్తకూ నోటీసులు..
తాజాగా ఈ కేసు.. అనూహ్య మలుపు తిరిగింది. కవిత భర్త దేవనపల్లి అనిల్ కుమార్ కూడా ఈడీ రాడార్‌లోకి వెళ్లారు. ఆయనకూ ఈడీ అధికారులు నోటీసులను జారీ చేశారు. సోమవారం విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే ఆయన సెల్ ఫోన్‌ను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
మరో నలుగురు..
అనిల్ కుమార్‌తో పాటు మరో నలుగులు తాజాగా ఈడీ నుంచి నోటీసులను అందుకున్నారు. కవిత కార్యాలయంలో ప్రజా సంబంధాల అధికారిగా పని చేస్తోన్న రాజేష్, మరో ముగ్గురికి ఈ నోటీసులు అందినట్లు తెలుస్తోంది. ఈ అయిదుమంది కూడా సోమవారం ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications