హైదరాబాద్‌లో మరోసారి ఈడీ దాడుల కలకలం.. రంగంలో 15బృందాలు; టార్గెట్ ఎవరంటే!!

తెలంగాణ రాష్ట్రాన్ని దర్యాప్తు సంస్థలు వదలడం లేదు. తరచుగా ఐటి, ఈడి, సిబిఐ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే తెలంగాణా రాష్ట్రంలో మంత్రి మల్లారెడ్డి, గంగుల కమలాకర్, ఎంపీ రవిచంద్ర, కేసీఆర్ తనయ ఎమ్మెల్సీ కవిత వంటి వారు కూడా దర్యాప్తు సంస్థల దాడులు ఎదుర్కొన్నారు. కేంద్రం తెలంగాణపై కక్ష సాధింపులో భాగంగా ఈ దాడులు చేస్తున్నారని తెలంగాణా బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకు పడిన విషయం తెలిసిందే.

తాజాగా హైదరాబాద్లో మరోమారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల సోదాలు కలకలంగా మారాయి. ఈరోజు తెల్లవారుజాము నుంచే ఈడి అధికారులు ఏకకాలంలో 15 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. 15 బృందాలుగా విడిపోయిన ఈడి అధికారులు ప్రస్తుతం సోదాలు జరుపుతున్నారు. మణికొండ, జూబ్లీహిల్స్, పంజాగుట్ట ప్రాంతాలలో ప్రస్తుతం ఈడీసోదాలు కొనసాగుతున్నాయి. ప్రముఖ పారిశ్రామికవేత్త మాలినేని సాంబశివరావు నివాసంలోను, ఆయన కార్యాలయాలలోను, మరికొంతమంది ఇళ్ళలోనూ ఈడి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

ed1

మాలినేని సాంబశివరావు 4 కంపెనీలకు డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. మాలినేని సాంబశివరావు కాకతీయ క్రిస్టల్ పవర్ లిమిటెడ్, టెక్నో యూనిట్ ఇన్ఫ్రాటెక్, ట్రాన్స్ ట్రై రోడ్ ప్రాజెక్ట్, ట్రాన్స్ ట్రై పవర్ ప్రాజెక్ట్ లకు ఆయన డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. అయితే ఈ సంస్థలు వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను ఎగవేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.

అంతేకాదు ఈ సంస్థలు మనీలాండరింగ్ కు పాల్పడినట్లుగా కూడా అభియోగాలు ఉన్న నేపథ్యంలో ఈడీ అధికారులు 15 బృందాలుగా విడిపోయి ఈ సంస్థల కార్యాలయాల్లోనూ, డైరెక్టర్ గా పని చేస్తున్న మాలినేని సాంబశివరావు ఇళ్లలోనూ, మరికొంత మంది ఇళ్ళలోనూ ఈరోజు తెల్లవారుజాము నుంచి ఏకకాలంలో సోదాలు జరుపుతున్నారు.

వీరు బ్యాంకుల నుండి తీసుకున్న రుణాల ఎగవేతకు సంబంధించి సిబ్బందిని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ కంపెనీలకు సంబంధించిన ఆర్ధిక లావాదేవీలను, బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇక తెలంగాణలో తాజా ఈడి సోదాల నేపథ్యంలో చాలామంది పారిశ్రామికవేత్తలు, రాజకీయ ప్రముఖులు టెన్షన్ పడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+