Mahipal Reddy: ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడి సోదాలు..
పటాన్ చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మహిపాల్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యుల, బంధువుల కూడా సోదాలు కొనసాగుతోన్నాయి. తెల్లవారుజామున 4 గంటల నుంచి మొత్తం మూడు చోట్ల తనిఖీలు నిర్వహిస్తూన్నారు. మహిపాల్ రెడ్డి బంధువులకు రియల్ ఎస్టేట్స్, మైనింగ్ ఇంకా ఎన్నో బిజినెస్ లు ఉన్నట్టు స్థానంగా ప్రచారం జరుగుతోంది. వీటీలో మహిపాల్ రెడ్డి కూడా వాటా ఉందని ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఈడీ రైడ్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల ఓ కేసులో గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. నిజాంపేటలోని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లోనే కాకుండా.. నిజాంపేటలోని వారి బంధువుల ఇళ్లలో కూడా సోదాలు చేస్తున్నారు. గతంలో రూ.341 కోట్లు చెల్లించాలని మైనింగ్ అధికారులు నోటీసులు ఇచ్చారు.
భూగర్భ గనుల శాఖకు భారీగా సీనరేజ్ నిధులు ఎగవేసినట్లు ఆరోపణలు రావడంతో ఈడీ సోదాలు చేస్తోంది. మధుసూదన్ రెడ్డి బినామీ పేర్లతో వ్యాపారం చేస్తున్నట్లు ఈడీ గుర్తించింది. 72.8 లక్షల మెట్రిక్ టన్నుల మెటల్ తవ్వేసి కేవలం 40. 8 లక్షల మెట్రిక్ టన్నులకే సీనరేజ్ చెల్లించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే లిక్కర్ కుంభకోణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జైలులో ఉన్నారు.

కవితపై కూడా ఈడీ కేసు నమోదు చేసింది. కొద్ది రోజుల క్రితం మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కూడా మాజీ సీఎం కేసీఆర్ పై ఈడీ కేసు నమోదు చేసిందని చెప్పారు. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. మాజీ మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిపై కూడా చర్యలుంటాయని చెప్పారు. బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి లక్ష కోట్లకు అధిపతని ఆరోపించారు. హైదరాబాద్ శివారులో రూ.100 కోట్లకు ఎకరా లెక్కన కొన్నాడని పేర్కొన్నారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications