స్నేక్‌గ్యాంగ్‌కు పదేళ్ల శిక్ష పడొచ్చు: అమ్మాయి కోర్టులో రేప్ జరిగిందని చెప్పనందుకే
హైదరాబాద్: బాధితురాలు తనపై అత్యాచారం జరిగినట్లు కోర్టులో చెప్పకపోవడం వల్లే స్నేక్ గ్యాంగ్ పైన అత్యాచారం అభియోగాలు రుజువు కాలేదని లాయర్ దేవరాజ్ మంగళవారం తెలిపారు. స్నేక్ గ్యాంగ్ నిందితుల్లో ఎనిమిది మందిని దోషులుగా కోర్టు తేల్చిన విషయం తెలిసిందే.
అయితే, వారిపై అత్యాచార అభియోగాలు మాత్రం రుజువు కాలేదు. దీనిపై లాయర్ స్పందించారు. తన పైన సామూహిక అత్యాచారం జరిగిందని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మెజిస్ట్రేట్ వద్ద వాంగ్మూలం ఇచ్చారన్నారు.

అయితే, సామాజిక కారణాల వల్ల బాధితురాలు అత్యాచారం జరిగినట్లు కోర్టులో చెప్పలేకపోయారని, అందుకే అభియోగాలు వీగిపోయాయని చెప్పారు. తొమ్మిదో నిందితుడిపై.. మిగతా ఎనిమిది మందిని కాపాడే ప్రయత్నం చేశారనే ఆరోపణలు ఉన్నాయన్నారు. కానీ అతని పైన అభియోగాలు పలు కారణాల వల్ల రుజువు కాలేదన్నారు.
స్నేక్ గ్యాంగ్ నిందితులకు పదేళ్లు అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడే అవకాశాలున్నాయని చెప్పారు. కాగా, హైదరాబాద్ శివారులో అకృత్యాలకు పాల్పడిన స్నేక్ గ్యాంగ్ కేసుపై కోర్టు మంగళవారం తీర్పు చెప్పింది. శిక్షను మాత్రం బుధవారం ఖరారు చేయనుంది.












Click it and Unblock the Notifications