ష్.. గప్ చుప్.. మూగబోయిన మైకులు; మొదలైన నిశ్శబ్ద యుద్ధం!!
తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారం ముగిసింది. గత నెలరోజులుగా హోరెత్తిన మైకులు ఒక్కసారిగా మూగబోయాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచార పర్వానికి నేడు సాయంత్రం 5 గంటలకు తెరపడింది. ఈ ఎన్నికలలో అత్యధిక స్థానాలను గెలుచుకోవాలని అన్ని రాజకీయ పార్టీలు హోరాహోరీగా చివరి నిమిషం వరకు సర్వశక్తులను ఒడ్డి ఎన్నికల ప్రచారాన్ని చేశాయి. జాతీయ స్థాయి నాయకులు రాష్ట్రస్థాయి నాయకులు రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రజల మద్దతును కూడగట్టే ప్రయత్నం చేశారు.
ష్.. గప్ చుప్ ... 48గంటల పాటు నిశ్శబ్ద యుద్ధం
ఇక ప్రస్తుతం తెలంగాణలో 48గంటల పాటు నిశ్శబ్ద యుద్ధం కొనసాగనుంది. 17లోక్ సభ నియోజకవర్గాల పరిధిలోని 119అసెంబ్లీ సెగ్మెంట్లలో 106చోట్ల సాయంత్రం ఐదు గంటలకు, మరో 13అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో సాయంత్రం 4గంటలకే ప్రచారం ముగిసింది. నక్సల్ ప్రభావిత ప్రాంతాలైన ఆసిఫాబాద్, సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని, భూపాలపల్లి, ములుగు, భద్రాచలం, పినపాక, ఇల్లందు, అశ్వారావుపేట, కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సాయంత్రం 4గంటలకు ప్రచారం ముగిసింది.

17 లోక్ సభ నియోజకవర్గాల్లో 525 మంది అభ్యర్థులు
13వ తేదీన లోక్ సభ నాల్గవ విడత ఎన్నికల్లో భాగంగా తెలంగాణలోని 17లోక్ సభ స్థానాల్లో పోలింగ్ జరుగుతుంది. కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్ కూడా అదే రోజున జరుగుతుంది. మొత్తం 17 లోక్ సభ నియోజకవర్గాల్లో 50 మంది మహిళలు సహా 525 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం 3కోట్ల 32లక్షల మంది ఓటర్ల కోసం 35వేల 809పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ప్రలోభాలపై ఎన్నికల కమీషన్ ఫోకస్
ఇందులో 1లక్షా 9వేల 941 బ్యాలెట్ యూనిట్లు, 50వేల 135 వివిప్యాట్లు, 44వేల 906 కంట్రోల్ యూనిట్లు అందుబాటులో ఉంచుతారు. సాయంత్రం ప్రచారం ముగిసిన తర్వాత ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు రాజకీయ పార్టీలు ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా ఎన్నికల కమీషన్ తగిన జాగ్రత్తలు తీసుకుంది.
ఎన్నికల పోలింగ్ ముగిసేవరకు కొనసాగనున్న ఆంక్షలు
ప్రలోభాలు, హింసాత్మక సంఘటనలపై చివరి 72 గంటలు నిఘా పెంచాలని, డబ్బు, మద్యం పంపిణి ఎక్కువగా జరిగే బస్తీలు, మురికివాడలపై తనిఖీలు జరపాలని సూచించారు. సామాజిక మాధ్యమాల్లో వదంతులు వ్యాప్తి కాకుండా చూడాలని మద్యం, డ్రగ్స్ రవాణను నిరోధించాలని సూచించారు. ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి 13వ తేది సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని ఇప్పటికే ఎన్నికల సంఘం ఆదేశించింది.
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
ఎన్నికలు ముగిసే వరకు పోలింగ్ కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పేర్కొంది. ఎన్నికల ఊరేగింపులు ర్యాలీలు సినిమాలు టీవీల ద్వారా ప్రచారం చేయడం కూడా నిషిద్ధమని ఎన్నికల సంఘం పేర్కొంది బల్క్ ఎస్ఎంఎస్లు పంపించడం ఒపీనియన్ సర్వేలు వెల్లడించడం కూడా నిషిద్ధం అని ఎన్నికల సంఘం పేర్కొంది ఎవరైనా ఎన్నికల నిబంధన అతిక్రమిస్తే రెండేళ్ల శిక్ష లేదా భారీ జరిమానా విధించే అవకాశం ఉందని లేదా రెండింటిని విధించే అవకాశం ఉందని ఎన్నికల సంఘం హెచ్చరిస్తోంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications