రాష్ట్రంలో మోగనున్న ఎన్నికల నగరా..ఇక్కడే అసలు ట్విస్ట్

తెలంగాణ రాష్ట్రంలో మరో ఎన్నికకు రంగం సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి అవుతున్నాయి. జనవరిలో పంచాయితీ ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది.డిసెంబర్ చివరి వారంలో పంచాయితీ ఎన్నికలకి సంబంధించిన షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనవరి 7న నోటిఫికేషన్ విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మూడు దశల్లో పంచాయితీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సన్నద్ధం అవుతోంది. తొలి దశలో జనవరి 21న, రెండో దశలో జనవరి 25న మూడో దశలో జనవరి 30న పోలింగ్ జరిగే అవకాశం. పంచాయతీలు, వార్డు సభ్యులకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారుపై ఎన్నికల కమీషన్ కసరత్తు చేస్తోంది.

అర్హులు వీరే..
సర్పంచ్/వార్డు సభ్యుల పోటీ చేసే అభ్యర్థికి ఇద్దరి కంటే ఎక్కువ మంది సంతానం ఉంటే పోటీకి అనర్హులు. జూన్ 1, 1995 తర్వాత మూడో సంతానం ఉండకూడదు. ఒక కాన్పులో ఇద్దరు లేదా ముగ్గురు పుడితే మాత్రం పోటీ చేయడానికి అర్హత పొందుతారు. ఒక వ్యక్తికి ఇద్దరు పిల్లలు పుట్టాక మొదటి భార్య చనిపోతే, రెండో భార్యకు ఒకరు లేదా ఇద్దరు సంతానం కలిగితే భర్తకు పోటీ చేసేందుకు అర్హత సాధిస్తారు. రెండో భార్యకు మాత్రం పోటీ చేసే అర్హత ఉంటుంది.

Election Commission prepared for another election in Telangana state

పోటీకి కనీస వయసు 21 ఏళ్లుగా నిర్ణయించారు.పోటీ చేసే గ్రామ పంచాయతీలో ఓటరుగా నమోదై ఉండాలి.వార్డు మెంబర్/సర్పంచ్‌కు ప్రతిపాదకుడు అదే వార్డు/గ్రామంలో ఓటరుగా ఉండాలి.రేషన్ డీలర్లు, సహకార సంఘాల వారు పోటీ చేయడానికి అర్హులే. స్థానిక సంస్థల్లోని ఉద్యోగులు, అంగన్‌వాడీ కార్యకర్తలు పోటీకి అనర్హులుగా నిర్ణయించారు.దేవాదాయ సెక్షన్ 15 ప్రకారం ఏర్పాటుచేసిన సంస్థల్లోని వారు పోటీకి అనర్హులు.ప్రభుత్వం ద్వారా 25 శాతానికి మించి పెట్టుబడి కలిగిన సంస్థలు/కంపెనీల మేనేజింగ్ ఏజెంట్, మేనేజర్లు, సెక్రెటరీలు పోటీకి అనర్హులు. ప్రభుత్వ ఉద్యోగులు రాజీనామా చేసి ధ్రువీకరణను నామినేషన్ల పరిశీలనలోపు ఇస్తే అర్హులేనని ఎన్నికల సంఘం పేర్కొంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే విడుదల కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+