తెలంగాణలో లోక్‌సభకే కాదు అసెంబ్లీకీ ఎన్నిక
Secunderabad Cantonment: దేశంలో ఎన్నికల నగారా మోగింది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర కమిషన్ విడుదల చేసింది. దేశ రాజధానిలోని విజ్ఞాన్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో.. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్, కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, డాక్టర్ ఎస్ఎస్ సంధూ ఈ షెడ్యూల్‌ను విడుదల చేశారు.
ఈ నాలుగు రాష్ట్రాల్లో..
లోక్‌సభతో పాటు ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశాలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ షెడ్యూల్ విడుదలైన వెంటనే దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చింది. లోక్‌సభతో పాటు మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత ప్రభుత్వాల అయిదేళ్ల పదవీ కాలం ముగిసినట్టయింది. ఓటర్లు కొత్త ప్రభుత్వాలను ఎన్నుకోవాల్సి ఉంటుంది.

ఏడు దశల్లో..
లోక్‌సభ ఎన్నికలన్నీ ఏడు దశల్లో పూర్తవుతాయి. తొలి దశ- ఏప్రిల్ 19, రెండ విడత- ఏప్రిల్ 26, మూడో విడత- మే 7, నాలుగో విడత- మే 13, అయిదో విడత- మే 20, ఆరో విడత- మే 25, ఏడో విడత- జూన్ 1వ తేదీన ముగుస్తాయి. తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాలకు నాలుగో విడతలో అంటే మే 13వ తేదీన పోలింగ్ షెడ్యూల్ అయింది.
ఆ అసెంబ్లీ స్థానానికి..
తెలంగాణలో లోక్‌సభతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికీ ఉప ఎన్నికను నిర్వహించనున్నట్లు ఈసీ తెలిపింది. భారత్ రాష్ట్ర సమితి శాసన సభ్యురాలు జీ లాస్య నందిత కన్నుమూత వల్ల ఈ స్థానానికి ఉప ఎన్నిక అవసరమైంది. ఇటీవలే రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
పోలింగ్ తేదీ..
మే 13వ తేదీన నాలుగో విడతలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుంది. దీనితో పాటు వివిధ కారణాల వల్ల దేశవ్యాప్తంగా ఖాళీ అయిన 25 అసెంబ్లీ నియోజకవర్గాలకూ ఉప ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ వెల్లడించింది. అత్యధికంగా హిమాచల్ ప్రదేశ్‌లో ఆరు అసెంబ్లీ స్థానాలు ఉప ఎన్నికలను ఎదుర్కొంటోన్నాయి.
ఇతర రాష్ట్రాల్లో..
గుజరాత్-5, ఉత్తరప్రదేశ్- 4, పశ్చిమ బెంగాల్-2 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, బిహార్, హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర, త్రిపుర, రాజస్థాన్‌లల్లో ఒకటి చొప్పున అసెంబ్లీ నియోజకవర్గాల్లో వివిధ దశల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ తెలియజేసింది.












Click it and Unblock the Notifications