ఇబ్రహీంపట్నంలో భారీగా పట్టుబడిన డబ్బు: ఎవరిది?

హైదరాబాద్: తెలంగాణ ముందస్తు ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ గెలుపు కోసం అనేక వ్యూహాలు రచిస్తున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. అసంతృప్తులు ఒక పార్టీ నుంచి మరో పార్టీకి జంపింగ్‌లు చేస్తున్నారు.

ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం కూడా నగదు ప్రవాహంపై దృష్టి సారించింది. ఎన్నికల స్క్వాడ్‌లను రంగంలోకి దించి ముమ్మర తనిఖీలు చేపట్టింది. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నంలోని గురునానక్ ఇంజినీరింగ్ కాలేజీ వద్ద సోమవారం ఎన్నికల స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది.

Election Squad Seized Huge Amount Belongs To TRS Leader In ibrahimpatnam

ఈ తనిఖీల్లో కారులో తరలిస్తున్న దాదాపు 27లక్షల నగదును ఎన్నికల స్క్వాడ్ అధికారులు పట్టుకున్నట్లు సమాచారం. పట్టుబడిన సొమ్ము ఆదిపట్ల గ్రామ ఉపసర్పంచ్ పల్లె గోపాల్ గౌడ్‌కు చెందినగా అధికారులు గుర్తించినట్లు తెలిసింది. దర్యాప్తు కొనసాగుతోంది. అయితే, ఆ సొమ్ము టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కిషన్ రెడ్డికి చెందినదిగా ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+